భవిష్యత్తును మార్చడానికి రాజ్యాంగం కల్పించిన అవకాశం ఓటు హక్కు అని చంద్రబాబు నాయుడు అన్నారు. పాలకులని ప్రశ్నించే అధికారం ఓటు ఇస్తుందని అన్నారు. రాతి యుగం నుండి స్వర్ణ యుగం వైపు మిమ్మల్ని నడిపించేది, మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు అని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రాష్ట్రం లో కొత్తగా ఓట్లు దొంగలు వచ్చారని ఓట్లు దొంగలు ఓట్లు తీసేస్తారని లేక పోతే మార్చేస్తారని నకిలీ ఓట్లు చేర్చి అవకాశం కూడా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు.
Advertisement
Advertisement
ఎప్పటికప్పుడు ఓటు ఉందో లేదో చూసుకోమని చెప్పారు ఓటు లేని వాళ్ళు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అన్నారు. అలానే ఆయన ఓటర్లందరికీ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!