చాణక్య చాలా విషయాల గురించి ఎంతో చక్కగా వివరించడం జరిగింది. చాణక్య చెప్పినట్లు చేయడం వలన లైఫ్ అంతా కూడా బాగుంటుంది. ఆచార్య చాణక్య ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని చెప్పారు. ఏదైనా విషయంలో ఒకళ్ళని ఒప్పించడం అనేది ఎంతో కష్టం. కానీ కొందరులో సహజంగానే లక్షణాలు ఉంటాయి ఈజీగా ఒప్పించేస్తూ ఉంటారు చాణక్యనీతిలో చాణక్య ఈ విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది.
Advertisement
ఈ సహాయంతో మీరు ఇతరుల మనసుని మార్చొచ్చు. వాళ్లని ఒప్పించొచ్చు ఎప్పుడైనా మీరు దేని గురించి అయినా ఏమైనా చెప్పాలనుకుంటే దాని పట్ల మీకు జ్ఞానం ఉండాలి. ముఖ్యంగా కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా మనసు మార్చుకోమని చాలామంది మన చుట్టూ ఉంటారు. వారి ఆలోచన ద్వారానే మారాలంటే కొన్ని చర్యలను తీసుకోవాలి.
Advertisement
డబ్బులు ఇస్తే అత్యాశ ఉన్న వాళ్ళని శాంతింప చేయొచ్చు. డబ్బు లేకుండా అత్యాశ ఉన్న వాళ్ళని ఆకర్షించలేరు. అత్యాశ ఉన్న వాళ్ళని డబ్బులు ఇచ్చి మార్చొచ్చు. అహంకారం ఉన్న వ్యక్తిని ఒప్పించడానికి లేదంటే నియంత్రించడానికి వారికి నమస్కరించాలి. రిక్వెస్ట్ చేసినా తలవంచిన వాళ్లని మీ దారిలోకి తీసుకు రావచ్చు. మూర్ఖుడిని ఒప్పించాలంటే మానసిక స్థితిని పరిశీలించి అతనిలా ప్రవర్తించాలి. అప్పుడు అతను సంతోషించి మీరు చెప్పింది వింటాడు. తెలివైన వ్యక్తి దేనికైనా నిజం చెప్పగలడు దేనినైనా ఒప్పించడానికి లాజిక్ ని చెప్పగలడు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!