చాణక్య మనకు చాలా విషయాలను చెప్పారు చాణక్య చెప్పినట్లు చేయడం వలన అద్భుతంగా జీవితం ఉంటుంది. జీవితంలో ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కరించుకోవచ్చు. జీవితంలో గెలుపు ఓటములు సహజం. కానీ ప్రతి ఒక్కరు కూడా గెలవాలని అందుకు తగ్గట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయాలు మీ దగ్గర ఉన్నట్లయితే ఎవరినైనా సరే ఓడించవచ్చని చాణక్య అన్నారు ఎప్పుడూ విజేతలుగా నిలవచ్చు. ఎప్పుడూ కూడా బ్యాడ్ టైం వస్తుందని రెడీగా ఉండాలి ఎప్పుడూ కూడా అంతా మంచే జరుగుతుంది. నేనే గెలుస్తాను అని ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి.
Advertisement
Advertisement
అలానే భయపడటం కూడా మంచిది కాదు. భయమే మనల్ని బలహీనంగా మారుస్తుంది. భయపడే వ్యక్తి కంటే ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి పరిస్థితిని దాటగలుగుతాడు. బాగా భయపడే వాళ్ళు ప్రమాదాల నుండి వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు. చెడు పరిస్థితులు ఎదురైనా సరే యోధుడిలా ఎదిరించాలి. చెడు పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ చెందకూడదు. గతం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పరిస్థితిని ఎదుర్కోవాలి అని చాణక్య అన్నారు. మీ శత్రువులు ఇటువంటి సమయానికి కారణం కావచ్చు. ప్రత్యర్థికి ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే సులభంగా గెలవచ్చు. ఇలా చాణక్య చెప్పినట్లు చేస్తే ఓటమి నుండి బయటపడొచ్చు ఎవరినైనా సరే ఓడించవచ్చు.
ఇంకొన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!