జీవితంలో విజయం సాధించాలని ఎవరు కోరుకోరు? అయితే.. అది విజయం సాధించే మార్గాలే చాలా మందికి తెలియవు. అయితే.. జీవితంలో విజయం సాధించడం కోసం చాణుక్యుడు కొన్ని మార్గాలను తెలిపాడు. వాటిని తెలుసుకుని, నిజ జీవితంలో ఆచరించడం ప్రారంభిస్తే.. తప్పకుండా విజయం సొంతం చేసుకోవచ్చు. మానవ జీవితంలో వివిధ అంశాలకు సంబంధించి ఆచార్య చాణక్యుడు సలహాలు ఇచ్చాడు. ఆయన సలహాలు నేటి జీవితానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.
Advertisement
ఆయన బోధనలు మనకు నిజ జీవితంలో విజయం సాధించే దిశగా ప్రయత్నం చేయడానికి ప్రోత్సాహం ఇస్తాయి. మన బుద్ధిని విజయం వైపు అడుగులు వేసేలా ప్రేరేపిస్తాయి. చాణక్య నీతి ప్రకారం ఈ ఐదు పనులను ప్రతి రోజు చేస్తూ ఉంటె.. జీవితంలో కచ్చితంగా విజయం సాధించవచ్చని పేర్కొన్నాడు. మీ ప్రధాన లక్ష్యాన్ని సాధించడం కోసం.. మీ జీవితంలోని 24 గంటలలో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకండి. మీ లక్ష్య సాధన కోసం సోమరితనాన్ని వదిలేసి ఓ ప్రణాలికను రచించుకోండి.
Advertisement
అది ప్రణాళిక ప్రకారం పనులు చేయండి. ఏ సమయానికి ఏ పని చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకుంటే.. మీ సమయం వృధా అవ్వకుండా ఉంటుంది. మీరు పోగొట్టుకున్న డబ్బుని తిరిగి సంపాదించుకోగలిగినా.. పోగొట్టిన సమయాన్ని మాత్రం ఎన్నటికీ వెనక్కి తీసుకురాలేరు. సమయాన్ని గౌరవించే ప్రతి పనిలోనూ మీరు విజయం సాధించగలరు. సమయం విలువైనది. దాన్ని పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోలేం. అందుకే సమయాన్ని వృధాగా పోగొట్టుకోకండి. అలాగే సమయానికి సరైన ఆహరం తీసుకుంటేనే.. అప్పుడే పూర్తి ఆరోగ్యంతో, పూర్తి ఉత్సాహంతో పని చేయగలుగుతారు. శరీరం అనారోగ్యంతో ఉంటె.. ఏ పనిని చెయ్యలేరు. మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!