ఆచార్య చాణక్య చాలా విషయాలను చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం అద్భుతంగా ఉంటుంది. చాణక్య చెప్పినట్లు చేస్తే ఎటువంటి సమస్యల నుండి అయినా కూడా ఈజీగా బయటపడొచ్చు. చాణక్య నీతి శాస్త్రంలో డబ్బులు ఎంత సంపాదించినా కొంత మంది తమ అలవాట్ల వలన డబ్బును పోగొట్టుకుంటారని, చెడు అలవాట్లు వదులుకుంటే మంచిదని చాణక్య చెప్పారు. డబ్బు సంపాదించి జీవితంలో పైకి రావాలంటే, మనిషి వదులుకోవాల్సిన చెడు అలవాట్ల గురించి ఇప్పుడే చూసేద్దాం. తెలివైన వ్యక్తి ఎప్పుడూ కూడా ఇంద్రియాలని నియంత్రణలో ఉంచుకుంటారని చాణక్య అన్నారు.
Advertisement
Advertisement
ఇతరుల ప్రభావానికి లోనైన వ్యక్తి జీవితాంతం బాధపడాలి. ఇతరుల ప్రభావానికి దూరంగా ఉండాలి లేకపోతే అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. అలానే వృధా ఖర్చులు చేయకుండా ఉండాలి. డబ్బులని పొదుపు చేయడానికి చూసుకోవాలి. వృధా చేయకూడదు అని చాణక్య అన్నారు. దురాశ ఉండే వ్యక్తులకి దూరంగా ఉండాలి లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడాలి. సోమరితనాన్ని వదులుకుంటే కూడా మంచిది. లేదంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలి. చాణక్య చెప్పిన విషయాలను కనుక పాటించినట్లయితే, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండొచ్చు. లేదంటే ఎంత సంపాదించినా కూడా పేదరికంలో కూరుకుపోవాల్సి ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!