Home » వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ పై కేసు నమోదు.. అసలు విషయం ఏంటంటే?

వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ పై కేసు నమోదు.. అసలు విషయం ఏంటంటే?

by Srilakshmi Bharathi
Ad

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ పై భారత్ లో కేసు నమోదు అయ్యింది. ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మిషెల్ వరల్డ్ కప్ తో ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. వరల్డ్ కప్ గెలిచిన తరువాత మిచెల్ వరల్డ్ కప్ పై కాలు పెట్టి రిలాక్స్ అవుతూ… బీర్ బోటిల్ ను చేత్తో పట్టుకుని కనిపించాడు. అలా ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాతో పంచుకోవడంతో క్షణాల్లో అవి వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ కి ఇచ్చే విలువ ఇదా? అంటూ అందరు మండిపడుతున్నారు.

Advertisement

ఆస్ట్రేలియా జట్టు వరుసగా ఆరవసారి కప్పు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వరల్డ్ కప్ ట్రోఫీపై రెండు కళ్ళు పెట్టి మిచెల్ తీసుకున్న ఫోటో వైరల్ అయ్యి అందరి ఆగ్రహానికి కారణం అయ్యింది. మార్ష్ తీరుని అందరు తప్పుబట్టారు. ఈ క్రమంలో మిచెల్ పై అలీఘర్‍కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్టీఐ కార్యకర్త కేసు నమోదు చేసారు. ఆయన ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్ వద్ద లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. ఆ ఫొటోతో భారతీయ భావోద్వేగాలను కించపరిచారని పేర్కొన్నారు.

Advertisement

ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని కాకుండా.. 140 కోట్ల భారతీయులను కూడా ఆయన అవమానించారని పేర్కొన్నారు. ఇకపై మిచెల్ భారత్ లో ఎక్కడా ఆడకుండా.. భారత్ పైనా ఎక్కడా ఆడకుండా నిషేధం విధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలా పేర్కొని తన డిమాండ్స్ ని వివరిస్తూ ఆయన ఆ ఫిర్యాదుని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ల ఆఫీసులకు కూడా పంపారు. వరల్డ్ కప్ ఆడిన మిచెల్ , భారత్ తో టి 20 కి మాత్రం దూరం అయ్యారు. మిచెల్ తో పాటు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఇతరులు కూడా మ్యాచ్ ముగియగానే వారి సొంత దేశానికీ వెళ్లిపోయారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడాలి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading