చిన్నపిల్లల మాడు లోపలికి వెళ్తే… విరేచనాలతో చనిపోతారనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ నమ్మకం నిజమేనా…? విరేచనాలు అయినప్పుడు మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనితో మన శరీరం డీహైడ్రేషన్ కు వెళ్ళే ప్రమాదం ఎక్కువ. తీవ్రమైన డీహైడ్రేషన్ తో పిల్లల్లో వచ్చే మార్పులు చూస్తే… మనం అరచేతిలో కానీ, అరికాలి లో కానీ నొక్కి పెట్టి వదిలేస్తే, చర్మం గుంట గా, పాలిపోయినట్లవుతుంది.
Advertisement
Advertisement
కానీ 3 సెకన్లలో తిరిగి సామాన్య స్థితికి రావాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా గుంట గా ఉంటే అది కచ్చితంగా డీహైడ్రేషన్. అలాగే మాడు ( anterior fontanelle) లోపలికి పోయినట్లు ఉంటే కూడా డీహైడ్రేషన్ ఉందేమో అని గ్రహించాల్సి ఉంటుంది. పిల్లలు మగత గా, నీరుకూడా తాగలేక పోతే ఖచ్చితంగా, వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. అవగాహన లేక చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఉదాహరణకు చూస్తే… 10 నెలల బిడ్డను బిడ్డని విరేచనాలు అని ఆస్పత్రికి తీసుకు వెళ్తే… బిడ్డ శరీరంలో నీటి శాతం పూర్తిగా పడిపోయింది. సెలైన్ ఎక్కించడానికి ఒక రక్తనాళం కూడా దొరకదు. అప్పుడు బిడ్డను కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. అంతు చిక్కని రోగాలే కాదు ఇటువంటి సమస్యలతో కూడా చిన్న పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు. అవగాహన అనేది చాలా కీలకంగా ఉంటుంది.