Home » ప్రపంచ కప్ నుండి బుమ్రా బయటకి..?

ప్రపంచ కప్ నుండి బుమ్రా బయటకి..?

by Azhar
Ad
భారత జట్టు బౌలింగ్ యూనిట్ ను మూడు ఫార్మాట్ లలో ముందుండి నడిపించే బౌలర్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు జస్ప్రీత్ బుమ్రా. కానీ ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకొని భారత జట్టు ఇండియాకు వచ్చిన తర్వాత నుండి బుమ్రా వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత జరిగిన ఏ సిరీస్ లోని బుమ్రా ఆడలేదు.
ఇక ఈ సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ కూడా బుమ్రా దూరంగానే ఉన్నాడు. ఇక బుమ్రా లేకపోవడంతో బౌలింగ్ లో చతికల పడిపోయిన భారత జట్టు సూపర్ 4 లోనే ఇంటికి వచ్చేసింది. కానీ వచ్చే నెలలో జరిగే ప్రపంచ కప్ కు బుమ్రా అందుబాటులోకి వచ్చాడు అని.. అతడిని వరల్డ్ కప్ తో పాటుగా ఆసీస్, సౌత్ ఆఫ్రికా సిరీస్ లకు కూడా సెలక్టర్లు ఎంపిక చేసారు.
అయితే ఆసీస్ సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ లు ఆడిన బుమ్రా ఇప్పుడు మళ్ళీ వెన్నునొపితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అందువల్లే సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో ఆడని బుమ్రాకు ఇప్పుడు కనీసం నాలుగు నెలల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. దాంతో బుమ్రా వచ్చే ఏడాది ఆసీస్ లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు దూరం అవుతున్నాడు అని తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Visitors Are Also Reading