సినిమా నటీనటులు ఆకస్మాత్తుగా మరణిస్తే వారు షూటింగ్ లో ఉన్నసినిమాలలో అయితే పాత్రను లేపేస్తారు. అదే సినిమా షూటింగ్ పూర్తయితే మాత్రం మరొకరి వాయిస్ తో డబ్బింగ్ చెప్పిస్తారు. కానీ కొన్నిసార్లు ఆ నటులకు తగిన వాయిస్ తో డబ్బింగ్ చెప్పేవాళ్లు దొరకకపోవచ్చు. అంతే కాకుండా ప్రేక్షకులకు ఎలాంటి అనుమానం రాకుండా ఆ నటుడి గొంతును దింపే డబ్బింగ్ ఆర్టిస్ట్ లు చాలా అరుదుగా ఉంటారు. ఇక టాలీవుడ్ లో కూడా కొంతమంది మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు.
ALSO READ : 24th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!
Advertisement
ఇక టాలీవుడ్ లో టాప్ కమెడియన్ లలో ఒకరైన ఎంఎస్ నారాయణ కూడా కొన్ని ప్రముఖ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఎంఎస్ నారాయణ నచిపోయినప్పటికీ టాలీవుడ్ లో అచ్చం ఆయనలా మాట్లాడుతూ వాయిస్ ను దించేసే కమెడియన్ మరొకరు ఉన్నారు. ఆ కమెడియన్ మరెవరో కాదు….జబర్దస్త్ ఆర్టిస్ట్ బుల్లెట్ భాస్కర్.
Advertisement
మొదట విదేశాల్లో ఉద్యోగం చేసిన బుల్లెట్ భాస్కర్ ఆ తరవాత సినిమాలపై తనకు ఉన్న ఆసక్తితో ఇండియాకు వచ్చేశారు. జబర్దస్త్ టీవీ షోలో భాస్కర్ అవకాశాన్ని దక్కించుకున్నారు. తన కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ వరకూ ఎదిగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాకుండా బుల్లెట్ భాస్కర్ ఓ గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న సంగతి కూడా తెలిసిందే.
ముఖ్యంగా మహేశ్ బాబు వాయిస్ తో బుల్లెట్ భాస్కర్ ఎంతో పాపులర్ అయ్యారు. అంతే కాదు మహేశ్ బాబు హీరోగా నటించిన నంబర్ 1 సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఇక ఎమ్ నారాయణ కొండవలసల వాయిస్ ను కూడా భాస్కర్ స్పష్టంగా చెబుతారు. అందువల్లే ఎంఎస్ చనిపోయిన తరవాత ఆయన సినిమాలకు బుల్లెట్ భాస్కర్ డబ్బింగ్ చెప్పారు.