భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా మందికి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీల మీద సెంచరీలు చేసిన కోహ్లీ.. ఇప్పుడు శతకం చేయక రెండు సంవత్సరాలు దాటిపోయింది. అలాగే ఈ ఐపీఎల్ 2022 కంటే ముందు కాస్తో కూస్తో పరుగులు చేసిన కోహ్లీ… ఈ సీజన్ లో మాత్రం మరి ఘోరంగా విఫలమయ్యాడు. యువ ఆటగాళ్లు రాణిస్తుంటే కోహ్లీ డక్ ఔట్స్ అవుతూ వచ్చాడు. అయితే ఈ ఐపీఎల్ తర్వాత కోహ్లీకి రెస్ట్ దొరికింది.
Advertisement
ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ నుండి కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు బీసీసీఐ సెలక్టర్లు. దాంతో కోహ్లీకి క్రికెట్ నుండి మైండ్ ను పక్కన పెట్టడానికి ఇదే మంచి సమయం అని ఆస్ట్రేలియన్ మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నారు. తాజాగా కోహ్లీ గురించి మాట్లాడిన బ్రెట్ లీ.. కోహ్లీ ఒక్కడు పరుగులు చేయకపోతే చాలు జట్టు కూడా అదే తరహా ప్రదర్శనలు చేస్తుంది. 2016 లో కోహ్లీ రెచ్చిపోయాడు. అతని జట్టు రెచ్చిపోయింది. లీగ్ దశలో టాప్ లో నిలిచింది.
Advertisement
ఈ ఏడాది కోహ్లీ సరిగ్గా ఆడలేదు. జట్టు కూడా. అంటేనే మనం అర్ధం చేసుకోవాలి జట్టు పైన అతని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది. అందుకే అభిమానులు ఎప్పుడు కోహ్లీ పరుగులు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు కోహ్లీ బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. కాబట్టి ఈ సమయాన్ని కోహ్లీ బాగా ఉపయోగించుకోవాలి. కొన్ని రోజులు క్రికెట్ నుండి తన ఆలోచనలను పక్కకు తీసుకెళ్లాలి. అలా చేస్తే కోహ్లీ మళ్ళీ తన పాత ఫామ్ లోకి వచ్చే ఆవేశం ఉంటుంది అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. అయితే కోహ్లీ భారత జట్టుకు రాబోయే టీ20 ప్రపంచ కప్ లో చాలా ముఖ్యమైన ఆటగాడి అనే విషయం అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :