కర్నాటక రాష్ట్రంలో నెలకొన్న హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించవద్దని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దాంతో ఈ వివాదం నెలకొంది. దాంతో విద్యాసంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదంటూ కర్నాటక హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి. కాగా ఈ వివాదంపై నేడు కర్నాటక హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.
Advertisement
Advertisement
విద్యాసంస్థల్లో హిజాబ్ ను నిషేదించాలి అంటూ వేసిన పిటిషన్లు అన్నింటిని హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదని పేర్కొన్నారు. ఇక నేడు హిజాబ్ పై తీర్పు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం ఆంక్షలను విధించింది. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ ను విధించారు. ఉడిపిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా పోలీసులు మోహరించారు.