Home » వ్యూహం సినిమాకి బ్రేక్.. హైకోర్ట్ కీలక నిర్ణయం..!

వ్యూహం సినిమాకి బ్రేక్.. హైకోర్ట్ కీలక నిర్ణయం..!

by Sravya
Ad

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ని తెర మీద కి తీసుకు రావాలని అనుకుంటున్నారు. అయితే వ్యూహం సినిమా కి బ్రేక్ పడింది జనవరి 11 వరకు వ్యూహం సినిమాని రిలీజ్ చేయద్దు అని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ సినిమా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జారీ చేసిన సెన్సార్ బోర్డు ఉత్తర్వులు రద్దు చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… వ్యూహం సినిమా రిలీజ్ అవ్వకుండా నిలిపివేయాలని టిడిపి కీలక నేత నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది.

Advertisement

సినిమా విడుదల కి హైకోర్టు నిరాకరించింది జనవరి 11 దాకా సినిమాని రిలీజ్ చేయడానికి లేదు అని, క్లియర్ గా చెప్పేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని తెర మీదకి తీసుకు రావడం జరిగింది. పొలిటికల్ డ్రామా ఇది. ఈ వ్యూహం సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. రంగం సినిమా ఫేమ్ అజ్మహల్ అమీర్ మానస రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంది.

Advertisement

ఏపీ సీఎం వైయస్ జగన్ రాజకీయ జీవితాన్ని తెలియజేస్తూ ఈ సినిమాని తెరమీదకి తీసుకురావాలని రాంగోపాల్ వర్మ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడిని కించపరిచేలా చూపించారని నారా లోకేష్ ఆరోపించారు. సినిమాకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూవీ రిలీజ్ అవ్వకుండా నిలిపివేయాలని కోరారు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పరువు కి నష్టం కలిగించేలా పాత్రలు ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు పిటిషన్ లో పేర్కొన్నారు శుక్రవారం హైకోర్టు విచారణ జరపనుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading