Home » కోవై సరళ ఇంటికి వెళ్లి… వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మానందం.. అసలేం జరిగిందంటే..?

కోవై సరళ ఇంటికి వెళ్లి… వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మానందం.. అసలేం జరిగిందంటే..?

by Sravya
Ad

టాలీవుడ్ కమెడియన్లలో బ్రహ్మానందం కూడా ఒకరు. బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో నటించి అందరినీ బాగా నవ్వించారు ఎన్నో అవార్డులను కూడా బ్రహ్మానందం దక్కించుకున్నారు. హాస్య నటుడు గా మంచి పేరు తెచ్చుకున్నారు. కోవై సరళ తో పాటుగా చాలా సినిమాల్లో కామెడీ చేశారు బ్రహ్మానందం. వీళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ బాగా పండుతాయి. దర్శకులు వీళ్లిద్దరి మధ్య కామెడీ సీన్స్ ఉండేటట్టు చూసుకునేవారు. కామెడీ లో వీళ్ళిద్దరిని ఎవరు బీట్ చేయలేరు. భార్యాభర్తలుగా వీళ్ళిద్దరూ దాదాపు 70 కి పైగా సినిమాల్లో నటించారు.

Advertisement

Advertisement

ఇండస్ట్రీలో వీళ్ళు ఏకంగా 70 సినిమాల్లో నటించేసరికి వీళ్ళ మధ్య ఎఫైర్ గురించి అనేక వార్తలు వచ్చాయి. వీటిని బ్రహ్మానందం కానీ కోవై సరళ కానీ పట్టించుకోలేదు. అయితే ఒకసారి ఎక్కువగా ఈ వార్తలు రావడంతో కోవై సరళ బ్రహ్మానందంతో నటించే ఒక సినిమా టైంలో సినిమా చేయనని ఇంటి దగ్గరే ఉండిపోయారట. అసలు విషయం బ్రహ్మానందం కి తెలిసి ఇంటికి వెళ్లి ఎవరో ఏదో అన్నారని.. నువ్వు బాధ పడతావా.. నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదా అని చెప్పారట. పైగా మనలో ఇలాంటి దురుద్దేశం లేకపోతే ఎవరికో భయపడి మనం సినిమాల్లో నటించకుండా ఉంటే నిజంగానే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామని చెప్పారట. స్ట్రైట్ గా ఇలా చెప్పేసరికి ఆమె మళ్లీ బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఒప్పుకున్నారట.

Also read:

Visitors Are Also Reading