వెంటపడి ప్రేమించడం ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్పి పెళ్లికి నో చెప్పడం… అయినా వినకుంటే అడ్డు తొలగించుకోవడం ఇలాంటి ఘటనలు ఈమధ్య చాలా చోటుచేసుకుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిందని ప్రేమించిన యువతిని ఓ యువకుడు దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే… ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతానికి చెందిన ఆఫ్తాబ్ అమీన్… శ్రద్ధ వాకర్ లకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రేమించుకుని గత కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్నారు.
Advertisement
ఈ క్రమంలో పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మే 18న శ్రద్ధవాకర్ ను అహ్మద్ అమీన్ హత్య చేసి 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో పెట్టాడు. అనంతరం ఒక్కో పార్ట్ ను ఒక్కో ప్రదేశంలోకి తీసుకెళ్లి పడేశాడు. అయితే ఎవరికి అనుమానం రాకుండా శ్రద్ధ వాకర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండి ఆమె స్నేహితులతో చాట్ చేశాడు. కొద్దిరోజుల తర్వాత చాటింగ్ ఆపేశాడు. ఇక శ్రద్ధ వాకర్ ప్రేమాయణం ఇష్టం లేని తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడటం మానేశారు. కానీ ఆమె స్నేహితుల తో టచ్ లో ఉన్నారు.
Advertisement
శ్రద్ధ స్నేహితులు తమతో కూడా టచ్ లో లేదని చెప్పడంతో అనుమానం వచ్చిన శ్రద్దా పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు అహ్మద్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. దాంతో అహ్మద్ తనతో శ్రద్ధ కు గొడవ జరిగిందని. ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. అయితే చాటింగ్ లొకేషన్ ఆధారంగా పోలీసులు మరోసారి అహ్మద్ ను అదుపులోకి తీసుకుని తమ స్టైల్ లో విచారించారు.
ఈసారి జరిగిన విషయాన్ని అహ్మద్ బయట పెట్టాడు. అంతేకాకుండా హత్య చేసి ఫ్రిజ్ లో పెట్టిన అనంతరం అహ్మద్ అమిన్ మరికొందరు యువతులను ఇంటికి తీసుకువచ్చి వారితో కూడా డేటింగ్ చేసినట్టు విచారణలో తేలింది. నిందితుడిని ఆదారాలతో పట్టుకున్న పోలీసులు కటకటాల్లోకి పంపించారు.