బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. టాప్ 6 నుండి కాజల్ ఎలిమినేట్ అవ్వడంతో షన్ను,సిరి, సన్నీ, శ్రీరామ్, మానస్ లు ఫైనల్ కు చేరుకున్నారు. దాంతో వారిలో ఒకరు టైటిల్ ను గెలుచుకునే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. అయితే దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో అయినా బిగ్ బాస్ చాలా కఠినమైన నియమాలు కూడా ఉంటాయన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ లోకి ఒక్కసారి వెళితే మళ్లీ ఎలిమినేట్ అవ్వడం లేదా అనారోగ్య కారణాలు తప్ప మరే ఇతర కారణాలతో బయటకు పంపించరు. ఒకవేళ ఆ రూల్ ను ఎవరైనా బ్రేక్ చేసి బయటకు రావాలంటే తిరిగి బిగ్ బాస్ ఒప్పందం ప్రకారం డబ్బులు కట్టాల్సి ఉంటుంది.
Advertisement
ఇక ఈ రూల్ తో పాటూ మరికొన్ని రూల్స్ కూడా బిగ్ బాస్ లో ఉంటాయి. వాటిలో ఒకటి బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తరవాత ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తరవాతే తాము ఎలిమినేట్ అయినట్టు అధికారికంగా ప్రకటించాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి. కానీ కొంత మంది కంటెస్టెంట్ లు ఆత్రతతో ముందే పెడుతుంటారు. అయితే బిగ్ బాస్ నుండి ఈ గత వారం ఎలిమినేట్ అయిన కాజల్ కూడా అదే తప్పు చేసినట్టు తెలుస్తోంది.
Advertisement
కాజల్ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ అయ్యింది. అయితే కాజల్ ఎలిమినేట్ అయిన సంగతిని శనివారమే లీకురాయుళ్లు ప్రకటించారు. ఇక బిగ్ బాస్ లీకులను నిర్వాహకులు పెద్దగా పట్టించుకోరు కానీ కంటెస్టెంట్ లు మాత్రం అధికారికంగా ప్రకటించకూడదు. కానీ కాజల్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరవాత ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే…బిగ్ బాస్ బజ్ ఇంటర్య్వూ రాకముందే వేరే యూట్యూబ్ ఛానల్ లో లైవ్ పెట్టినట్టు తెలుస్తోంది. దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది.