Home » బిగ్ బాస్ ఇనాయా కు గతంలో పెళ్లి జరిగిందా ..? నెట్టింట పెళ్లి ఫోటో వైరల్…!

బిగ్ బాస్ ఇనాయా కు గతంలో పెళ్లి జరిగిందా ..? నెట్టింట పెళ్లి ఫోటో వైరల్…!

by AJAY
Ad

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఇనయ సుల్తానా కూడా ఒకరు. గతంలో ఇనయ చెప్పుకోదగ్గ సినిమాలు గానీ సీరియల్స్ గానీ చేయలేదు. కానీ ఆర్జీవీ తో కలిసి ఓ పార్టీలో స్టెప్పులు వేసి ఏకంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని అందుకుంది. ఆ తర్వాతనే ఇనయా సుల్తానా ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది.

Advertisement

ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. చాలా మందికి ఫేవరెట్ కంటెస్టెంట్ గా మారింది. అంతేకాకుండా బిగ్ బాస్ లో ఏకంగా 14 వారాల పాటు ఎలిమినేట్ అవ్వకుండా రానించింది. బిగ్ బాస్ లోకి రాకముందే బయట పాపులారిటీ ఉన్న చలాకి చంటి, పింకీ లాంటి సెలబ్రిటీలు సైతం ఎలిమినేట్ అయ్యారు.

Advertisement

కానీ ఇనయ 14 వారాల పాటు హౌస్ లో ఎలిమినేట్ అవ్వకుండా కొనసాగింది. ఇక ఇనయా సుల్తానా బిగ్ బాస్ హౌస్ లో ఆర్జే సూర్యతో క్లోజ్ గా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో వాళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇనయ ఎలిమినేషన్ చేయడం వల్లే సూర్య హౌస్ నుండి బయటకు వచ్చాడు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఇనయ వెళ్లి సూర్యను కలుసుకుంది.

ఇదిలా ఉంటే రీసెంట్ ఎలిమినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఇనయ గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి ఇనయ పెళ్లి విషయం… ఇప్పటికే ఇనయ వివాహం జరిగిందని ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఫోటోలో ఇనయ పక్కన ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అయితే అది అసలు ఇనయ సుల్తానా పెళ్లి ఫోటోనా …? లేదా ఆమె రూపు రేఖలతో ఉన్న మరొకరిదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Visitors Are Also Reading