Home » Bigg Boss 7: బిగ్ బాస్ అశ్వినికి పెళ్లి అయ్యిందా… భర్త ఎవరు?

Bigg Boss 7: బిగ్ బాస్ అశ్వినికి పెళ్లి అయ్యిందా… భర్త ఎవరు?

by Bunty
Ad

 

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్7 ప్రారంభమైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో ఐదు వారాల తర్వాత ఇంట్లోకి అశ్విని వచ్చింది. ఈ అమ్మాయి చూడడానికి చాలా అందంగా, మంచి హైట్, పర్సనాలిటీతో హీరోయిన్ మెటీరియల్ లా ఉంది. అంతేకాకుండా తన అమాయకమైన మాటలతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. బిగ్బాస్ హౌస్ లోకి రాకముందు అశ్విని గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెగ పాపులర్ అయిపోయింది. అంతేకాకుండా అశ్విని సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒక వీడియోని పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

Bigg Boss 7 Telugu Ashwini Sree Marriage Rumors

Bigg Boss 7 Telugu Ashwini Sree Marriage Rumors

ఈ అమ్మడు సినిమాలలో కూడా నటించింది. సరిలేరు నీకెవరు సినిమాలో రష్మికకి అక్కగా నటించింది. రాజా ది గ్రేట్ వంటి సినిమాలలో కూడా నటించింది. ఇండస్ట్రీకి హీరోయిన్ అవ్వాలని కోరికతో వచ్చింది ఈ అమ్మడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమైంది. చిన్నచిన్న సినిమాలలో హీరోయిన్గా కూడా నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అశ్విని వ్యక్తిగత విషయానికి వస్తే… తాను బీటెక్ పూర్తిచేసింది. వీరిది మధ్యతరగతి కుటుంబం. కుటుంబాన్ని పోషించాలనే ఉద్దేశంతో అశ్విని జాబ్ చేయాలని అనుకుందట. కానీ అందరూ హీరోయిన్ గా ట్రై చేయు అని చెప్పడంతో ఇండస్ట్రీకి వచ్చిందట.

Advertisement

Advertisement

ఇక ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అన్న భయంతో తన తల్లిదండ్రులు 2013 సంవత్సరంలోనే అశ్వినీకి వివాహం చేశారట. కానీ ఆ పెళ్లి తనకు ఇష్టంలేదట. దీంతో అతి తక్కువ సమయంలోనే అశ్విని తన భర్తతో విడాకులు తీసుకుందట. ఇక అశ్విని భర్త ఎవరు? ఏం చేస్తారు? అనే విషయాలు పెద్దగా బయటకు రాలేదు. ఇంతవరకు అశ్వినీకి వివాహం జరిగిందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అశ్వినికి వివాహమైందనే వార్త మాత్రం హల్చల్ అవుతోంది. అంతేకాకుండా అశ్వినికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading