విక్టరీ వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన మూవీ నువ్వు నాకు నచ్చావ్.. ఈ సినిమా అప్పట్లో ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిందో మనందరికీ తెలుసు. ఇది వెంకటేష్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ చిత్రంగా చెప్పవచ్చు.
Advertisement
ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.. కామెడీ మరియు ఎమోషన్స్ సీన్స్ తో సినిమా ఎంతో బాగుంటుంది. ఈ చిత్రం విడుదలై చాలా సంవత్సరాలు అవుతోంది. మనం కూడా ఈ చిత్రాన్ని చాలాసార్లు చూసి ఉంటాం. అయినా ఈ సినిమాలో జరిగిన ఆ చిన్న పొరపాటు మాత్రం గుర్తించలేదు..
Advertisement
ఇంతకి ఆ పొరపాటు ఏంటయ్యా అంటే.. ఈ చిత్రంలో వెంకటేష్ వాళ్ళ నాన్న స్నేహితుడు ఇంటికి ఉద్యోగం కోసం వస్తాడు. ఈ క్రమంలోని వెంకీకి ఆయన తండ్రి ఉత్తరం రాస్తారు. అది హీరోయిన్ ఆమె చెల్లికి ఇస్తుంది. అయితే ఆ ఉత్తరాన్ని తెచ్చుకోవడానికి వెంకి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఈ తరుణంలోనే హీరోయిన్ చెల్లెలు నా పేరు పింకీ అని, నేను లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్లో 9వ తరగతి చదువుతున్నానని పరిచయం చేసుకుంటుంది. కట్ చేస్తే పింకీ స్కూలుకు వెళ్లే సమయంలో తోటి స్టూడెంట్స్ తో చిన్న గొడవ జరుగుతుంది.
ఈ తరుణంలో వెంకీ అక్కడికి వచ్చి వారి భరతం పడతాడు. స్కూల్ బస్సులో పింకిని ఎక్కించి పంపిస్తాడు. అయితే ఆ స్కూల్ బస్సు మీద పేరు బీవీబీపీ స్కూల్ అని ఉంటుంది. ఇక పింకీ చెప్పిన స్కూల్ పేరు, మరియు ఆ బస్సు పై ఉన్న స్కూల్ పేరు అసలు మ్యాచ్ అవ్వడం లేదు. దీంతో నటిజెన్లు ఇంత చిన్న మిస్టేక్ ను దర్శకుడు ఎలా మిస్ అయ్యాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి..
also read: