రామ్ పోతినేని హీరోగా వచ్చిన స్కంద సినిమా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అందర్నీ నిరాశపరిచింది. లాంగ్ వీకెండ్ హాలిడేస్ దొరికినా కూడా సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. రెగ్యులర్ డేట్స్ లో వస్తే ఇంకా ఘోరంగా ఉండేదేమో..? భారీ హైప్ తో పాన్ ఇండియా సినిమా అని ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ నష్టాలు తప్పలేదు. స్కంద సినిమా రిలీజ్ అయ్యి కేవలం నాలుగు వారాలు మాత్రమే అయింది. అప్పుడే ఓటీటీ లోకి వచ్చేసింది. హాట్ స్టార్ స్కంద డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది.
Advertisement
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రెస్పాన్స్ పెద్దగా లేదు అటు ఇటుగా వస్తోంది. స్కంద మూవీ లోని ఒక బ్లెండర్ మిస్టేక్ వెలుగులోకి వచ్చింది సీఎం పాత్ర చేసిన శరత్, రామ్ పోతినేని మధ్య హీట్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఒక వ్యక్తిని ఈ సినిమాలో రామ్ తుపాకీ తో కాల్చుతాడు. దానికి శరత్ షాకింగ్ రియాక్షన్ ఇస్తాడు.
Advertisement
రామ్ చేతిలో చనిపోయిన వ్యక్తి శరత్ వెనుక షాట్ లో కనపడతాడు ఇంత పెద్ద తప్పుని గమనించకపోవడం ఏంటని బోయపాటిని సోషల్ మీడియాలో జనాలు ఆడేసుకుంటున్నారు. స్కంద కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్కందతో మరో ఫ్లాప్ రామ్ ఖాతా లో పడిపోయింది స్కంద సినిమాలో రామ్ సరసన శ్రీలీలే నటించిన విషయం తెలిసిందే. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. సాంగ్స్ బీజీఎమ్ కూడా నెగిటివ్ టాక్ ని తెచ్చుకున్నాయి.
స్కంద కాదు ఇది బోయపాటి గాడి బొంద🤦♂️ pic.twitter.com/p49ggMdbMQ
— ఇవివి పంచ్ లు🤙 (@evvpunchlu333) November 2, 2023
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!