టీమిండియాలో ఎంతమంది బౌలర్లు ఉన్నప్పటికీ…. టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. 2012 సంవత్సరంలో వన్డే మ్యాచ్ ఆడి ఇతను అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు భువనేశ్వర్ కుమార్. ఇక 2013 సంవత్సరంలోనే టెస్ట్ మ్యాచ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు ఈ ఫాస్ట్ బౌలర్. ఇక వచ్చిన ఛాన్స్ లను సద్వినియోగం చేసుకున్న భువనేశ్వర్ కుమార్… తన కెరీర్ లో ఎన్నో విజయాలను టీమ్ ఇండియాకు అందించాడు.
Advertisement
ఉత్తరప్రదేశ్ కు చెందిన భువనేశ్వర్ కుమార్… ఈ మధ్యకాలంలో టీమిండియాలో సరిగా రాణించడం లేదు. దీంతో టీమిండియాలో చోటు కూడా దక్కడం చాలా గగనం అయిపోయింది. ఇలాంటి తరుణంలో భువనేశ్వర్ కుమార్ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భువనేశ్వర్ తన ఇంస్టాగ్రామ్ లో.. తన బయోడేటాను మార్చేశాడు.
Advertisement
మొన్నటి వరకు ఇండియన్ క్రికెటర్ అని ఉన్న బయోను కేవలం ఇండియన్ గా మార్చేసుకున్నాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ బై చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తన ట్విట్టర్ వేదికగా మాత్రం… తన బయోను ఎప్పటిలాగే ఇండియన్ క్రికెటర్ గానే పెట్టుకున్నాడు భువనేశ్వర్ కుమార్. దీంతో భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్ ప్రకటించలేదని… అతను అంటే పడని వారు ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని భువి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై భువనేశ్వర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి
కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్ సంచలనం
బ్యాడ్ లక్ అంటే ఇదే… 99 పరుగులు కొట్టి నాటౌట్ గా మిగిలిపోయిన ఆటగాళ్లు వీరే !
సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!