తిరుపతిలో పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి వివాదం బాగా ముదురుతోంది పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో మంత్రి రోజా మీద సంచలన ఆరోపణ చేసిన కౌన్సిలర్ భువనేశ్వరి సవాల్ విసిరారు. తన వద్ద డబ్బులు తీసుకోలేదని రోజా తన పిల్లల మీద ప్రమాణం చేస్తారా అని అన్నారు రోజా కనుక ప్రమాణం చేశారంటే బహిరంగంగా క్షమాపణలు చెప్తారని భువనేశ్వరి చెప్పారు. భువనేశ్వరి ఆరోపణల ప్రకారం పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 17 వ వార్డు కౌన్సిలర్ గా భువనేశ్వరి అనే మహిళ ఏకగ్రీవంగా సెలెక్ట్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో భువనేశ్వర్ కి చైర్మన్ పదవి ఇస్తానని రోజా హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement
మిగిలిన విషయాలు అన్న కుమారస్వామి తో మాట్లాడాలని రోజా చెప్పారు. 70 లక్షలు మున్సిపల్ చైర్మన్ పదవికి ఇవ్వాలని కుమారస్వామి డిమాండ్ చేశారు 40 లక్షలకు బేరం కుదిరింది రెండు దఫాలలో భువనేశ్వరి ఇస్తానన్నారు. మునిసిపల్ ఎన్నికలు జరిగి మూడేళ్లు అవుతున్న రెండవ దఫా చైర్మన్ ఇస్తామని చెప్పిన మాట నెరవేర్లేదు చైర్మన్ పదవిని ఎన్నికలయ్యాక ఇస్తామని మాయమాటలు చెబుతున్నారని భువనేశ్వరి ఆరోపిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ హరి భువనేశ్వరి రాజకీయ కక్షతో అబద్ధాలు చెబుతున్నారు అన్నారు డబ్బులు తీసుకోలేదని మంత్రి రోజా పిల్లల మీద ప్రమాణం చేస్తారని ఆమె సవాల్ విసిరారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!