Home » భూమా మౌనిక జీవితంలో ఇంత విషాదం ఉందా…మొద‌ట తల్లి మూడు నెల‌ల‌కే తండ్రి..!

భూమా మౌనిక జీవితంలో ఇంత విషాదం ఉందా…మొద‌ట తల్లి మూడు నెల‌ల‌కే తండ్రి..!

by AJAY
Ad

టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ భూమా మౌనికారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి రెండో పెళ్లి అయిన‌ప్ప‌టికీ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అంతే కాకుండా భూమా మౌనిక‌కు పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ మనోజ్ కు సినిమా బ్యాగ్రౌండ్ ఉండ‌టం తో వీరి వివాహం తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్ గా మారింది. కాగా తాజాగా మౌనికా రెడ్డి మత‌న భ‌ర్త మ‌నోజ్ తో క‌లిసి వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న అలా మొద‌లైంది టాక్ షో లో సందడి చేసింది.

Advertisement

ఈ ఇంట‌ర్వ్యూలో మౌనిక రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న త‌ల్లి చనిపోయిన రెండు రోజుల‌కే రోడ్ క్యాంపెయిన్ కు వెళ్లాల్సివ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఎన్నిక‌లు కావ‌డంతో త‌మ కుటుంబ‌మంతా ప్ర‌జా జీవితంలో గ‌డిపేసింద‌ని చెప్పింది. అంతేకాకుడా ఆ త‌ర‌వాత తాను జీవితంలో ముందుకు సాగాన‌ని త‌న సోద‌రి రాజ‌కీయాల్లో చురుకుగా మారింద‌ని దాంతో తండ్రి ఒంట‌రి అయ్యాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Advertisement

మూడేళ్ల‌కే తండ్రి కూడా దూరం అయ్యాడని ఎమోష‌న‌ల్ అయ్యింది. ఆ రెండు సంఘ‌ట‌న‌ల త‌ర‌వాత జీవితంలో ఇంత‌క‌న్నా ఏం జ‌రుగుతుంద‌నే తెగింపు వ‌చ్చింద‌ని చెప్పింది. అంతే కాకుండా వ్య‌క్తిగ‌త జీవితంలో చాలా స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అమ్మ సంత్స‌రీకం రోజున చాలా ఒంట‌రగా అనిపించింద‌ని ఆరోజే అమ్మా నాకేం కావాలో నీకు తెలుసు న‌న్ను ఎక్క‌డ ఉంచాలో అక్క‌డ ఉంచు అని కోరుకున్నాన‌ని తెలిపింది.

అదే రోజు మ‌నోజ్ ఆళ్ల‌గ‌డ్డ వ‌చ్చాడ‌ని త‌న‌కు అండ‌గా నిలిచాడ‌ని చెప్పింది. మోహ‌న్ బాబుగారు చాలా స‌ర‌దా మనిషి అని అమ్మ చ‌నిపోయిన‌ప్ప‌టి నుండి ఆంటీ నాతో ట‌చ్ లో ఉన్నార‌ని తెలిపింది. వాళ్లు దొర‌క‌డం నాకు వ‌రం లాంటిది అంటూ ఎమోష‌న‌ల్ అయ్యింది. మంచు ల‌క్ష్మి త‌న‌కు త‌ల్లిలా సాయం చేసింద‌ని ఆమెతో అనుబంధం మాటల్లో చెప్ప‌లేన‌ని చెప్పింది.

Visitors Are Also Reading