పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలలో భీమ్ నాయక్ కూడా ఒకటి. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఆయ్యపునుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రానాకు జోడిగా సంయుక్త మీనన్, పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యమీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను మొదలు పెట్టారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో కిన్నెర మొగులయ్య కిన్నెర స్వరాలు అందించారు. ఈపాట తో మొగులయ్య కు కూడా మంచి పేరు వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా నుండి అడవి తల్లి మాట అనే మరో పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటకు కూడా ఒక ప్రత్యేకత ఉండగా శ్రోతల ఆదరణ పొందుతోంది.
Advertisement
Advertisement
ఈ పాటను సాహితీ చాగంటి మరియు దుర్గవ్వ కలిసి పాడారు. దుర్గవ్వ ఒక సినిమాకు పాట పాడటం ఇదే మొదటిసారి. కానీ దుర్గవ్వ గతంలో అనేక పల్లె పాటలను పాడి అలరించారు. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న “ఉంగూరమే రంగైన రాములాల టుంగూరమే” అనే ప్రైవేట్ పాటను దుర్గవ్వ నే పాడారు. అంతే కాకుండా సిరిసిల్ల చీర అనే పాటను కూడా పాడారు. మరికొన్ని మరాఠీ పాటలు సైతం దుర్గ పాడారు. దుర్గవ్వ మంచిర్యాల జిల్లా కు చెందిన వారు. అంతే కాకుండా చిన్నప్పటి నుండి దుర్గవ్వ పొలం పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె చదువుకోలేదు కానీ పాటలపై ఆమెకు ఉన్న ఆసక్తితో పొలం పనులు చేస్తున్న సమయంలో పాటలు పాడుతూ ఉంటారు. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు పాట పాడి ప్రశంసలు పొందుతున్నారు.
Also read : అలా అనిపిస్తేనే పెళ్లి చేసుకుంటా…పెళ్లిపై బుట్టబొమ్మ హాట్ కామెంట్స్..!