ఎన్టీఆర్ నటవారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య సినిమా వచ్చిందంటే విదేశాల్లో పండగ చేసుకునే అభిమానులు బాలయ్య ఒక్కడికి మాత్రమే ఉన్నారు. ఇక బాలయ్య కెరీర్ లో ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఆయన నటించిన వైవిధ్యభరితమైన సినిమాలే అని చెప్పాలి.
Advertisement
బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో భైరవద్వీపం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో బాలయ్య తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1994 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్ లలో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ సినిమాకు అన్ని విభాగాల్లో 9 నంది అవార్డులు వచ్చాయి.
Advertisement
జానపద చిత్రంగా తెరపైకి వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా రోజా హీరోయిన్ ఆ నటించింది. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెన్సార్ విషయంలో ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. ఈ సినిమాకు ముందుగా సెన్సార్ జరిగిపోయిందట..కానీ ఓ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ కు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమాలో గుర్రాలకు బాణాలు తగిలి కిందపడే కొన్ని సీన్ లు ఉన్నాయి.
అయితే ఆ సీన్ లపై సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే…సినిమాలో గుర్రాలకు బాణాలు తగిపి కిందపడిపోతున్న సన్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలకు అటవీశాఖ వాళ్లు, బ్లాక్రాస్ వాళ్లు అభ్యంతరం తెలిపితే మాత్రం సీన్లను తొలగించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారట. కానీ సినిమా విడుదల తరవాత ఎలాంటి అభ్యంతరాలు రాకపోగా సినిమా మంచి విజయం సాధించింది.