పెళ్లి తరవాత భార్యభర్తలు అస్సలు గొడవలు పడకూడదు అని చాలా మంది చెబుతుంటారు. గొడవల వల్ల ప్రశాంతత ఉండదని గొడవలు పెరిగితే కాపురాలే కూలిపోతాయని చెబుతుంటారు. అయితే గొడవల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవి పెద్ద పెద్ద గొడవలు కాదు..గంట రెండు గంటల్లో సర్దుకునే చిన్నగొడవలు. అసలు గొడవల వల్ల వచ్చే లాభాలు ఏంటి..? మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం….గొడవ జరిగినప్పుడు కోపంలో మనసులో ఉన్నదంతా కక్కేస్తుంటారు.
Advertisement
ఎప్పుడు చెప్పవని వాటిని కూడా ఆవేదనతో చెప్పేస్తారు. అయితే అలా మనసులో ఉన్నది అంతా కక్కేయడం వల్ల తమ భాగస్వామి భావాలను అర్థం చేసుకుంటారట. అంతే కాకుండా వారి బాధను పోగొట్టేందుకు మరింత ప్రేమగా మెలగటానికి ప్రయత్నిస్తారట. అదేవిధంగా గొడవ జరిగిన తరవాత తేలికగా ఉంటారు.
Advertisement
మనసులో ఉన్న ఎమోషన్స్ అన్నీ పోయి ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి అది కూడా దంపతులకు సహాయపడుతుందట. గొడవల జరిగిన తరవాత అసలు గొడవ ఎందుకు జరిగింది. దానికి కారణం ఏంటి మళ్లీ అలా గొడవ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఇలా అన్నీ ఆలోచించింది.
మరోసారి అలా గొడవలు జరకుండా జాగ్రత్త పడతారట. అంటే కాకుండా చిన్నచిన్న వాదనలు జరిగిన తరవాత ప్రేమ కూడా రెట్టింపు అవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే మానసిక నిపుణులు చెబుతుంది చిన్న గొడవలు మాత్రమే అంతేగానీ తరచూ గొడవలకు దిగితే దంపతులకు ప్రశాంతత కరువు అవుతుందని చెబుతున్నారు.
ALSO READ : మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ చిట్కాలతో తెలుసుకోండి..!