భోజనం చేసిన తర్వాత పావు గంట అయినా నడిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భోజనం తిన్న తర్వాత చాలామంది వెంటనే రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా మంచం మీద వాలి టీవీ చూడడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ నిజానికి అన్నం తిన్నాక ఒక పావుగంట సేపైనా నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది. భోజనం తిన్న తర్వాత నడవడం వలన పెప్సీన్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. జీర్ణ క్రియ ని సాఫీగా జరిగేటట్టు ఇది చేస్తుంది.
Advertisement
Advertisement
కడుపు ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యల్ని తగ్గిస్తుంది రాత్రి భోజనం తర్వాత నడవడం వలన శారీరిక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నడవడం వలన జీర్ణక్రియ పెరుగుతుంది. కొవ్వు తగ్గుతుంది గుండె ఫోటో రిస్క్ కూడా తగ్గుతుంది. అధిక బరువుని కంట్రోల్ లో ఉంచుతుంది. అలానే తిన్నాక నడవడం వలన శరీరంలో రిలీజ్ అయ్యే ఇన్సులిన్ బ్లడ్ షుగర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్, హైపర్ టెన్షన్ వంటివి కూడా తగ్గుతాయి భోజనం తిన్నాక కనీసం పది నిమిషాలు అయినా నడిస్తే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది ఇలా తిన్న తర్వాత నడవడం అలవాటు చేసుకోండి. రోజు నడిస్తే ఈ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.
Also read:
- నిద్ర పోవడానికి ముందు.. అస్సలు ఈ పనులు చెయ్యకూడదు.. చూసుకోండి…!
- ఎలా LCU ని లియో ని కనెక్ట్ చేసారు…? ఈ ట్విస్ట్ ని మీరు కూడా గమనించారా..?
- ఈ లక్షణాలు ఉన్న భార్య వస్తే.. ఇక అంతా సంతోషమే..!