Home » SR NTR కాషాయ దుస్తుల వెనుక ఇంత స్టోరీ ఉందా..?

SR NTR కాషాయ దుస్తుల వెనుక ఇంత స్టోరీ ఉందా..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండరీ నటుడిగా ఓ వెలుగు వెలిగాడు సీనియర్ ఎన్టీఆర్. సినిమా ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఉంది అంటే ప్రధాన కారకుడు ఆయనే అని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ తెలుగు సినిమా ఫీల్డ్ లో చేయని పాత్ర లేదు. ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొని, తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే సీఎం అయ్యారు ఎన్టీఆర్. ఇప్పటివరకు అంత తక్కువ టైంలో పార్టీ స్థాపించి మరి ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు ఇప్పటివరకు లేరని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ అంటే ఇప్పటికి చాలామంది ప్రజలకు అభిమానం. మరి అలాంటి ఆయన ఎప్పుడు చూసినా కాషాయ దుస్తులు ధరించి ఉండేవారట.

Advertisement

మరి కాషాయ దుస్తులు ఎందుకు ధరించేవారు దాని వెనుక ఉన్న కథేంటో చూద్దాం.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో జరిగినటువంటి ఒక సినిమా అవార్డు ఫంక్షన్లో తొలిసారి కాషాయ దుస్తులు ధరించి వచ్చారు. ఈ తరుణంలో విలేకరులు గెటప్ మార్చడం వెనక కారణమేంటని ప్రశ్నించారు. దీనిపై సమాధానం ఇచ్చిన ఎన్టీఆర్ ఇలా మాట్లాడారు.. ఒక ఘటన నన్ను చాలా కలిచి వేసిందని,అందుకే ఈ వేషధారణ అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆయన ఆ దుస్తులు ధరించడం వెనుక స్వామి అగ్నివేష్ ఉన్నారని ఒక ఉద్యమంలో భాగంగా అగ్నివేష్ ను ఎన్టీఆర్ కలిశారు. అగ్నివేష్ ఎప్పుడు కాషాయ దుస్తుల ధరిస్తారు.

Advertisement

ఈ తరుణంలో ఎన్టీఆర్ ఆయన దుస్తుల వెనుక ఉన్నటువంటి ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు. సన్యాసిగా ఉంటూ ఈ దుస్తులు ధరిస్తే స్వార్థం మనలో ఉండదు. మనకోసం మనం కాకుండా సమాజం కోసం పనిచేయాలనే తపన ఎక్కువగా కలుగుతుందని ఎన్టీఆర్ చెప్పారట. దీంతో ఆ మాటలు విన్న ఎన్టీఆర్ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఆ దుస్తులు ధరించి 8 ఏళ్లు ప్రజలకు నిస్వార్థ సేవ చేశారట. ఆ తర్వాత లక్ష్మీపార్వతి జీవితంలోకి వచ్చాక ఆ దుస్తులను వదిలిపెట్టారని సమాచారం.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading