జిడ్డు చర్మంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. మీది కూడా జిడ్డు చర్మమేనా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. జిడ్డు చర్మంతో ఇబ్బంది పడే వాళ్ళు, రోజు రెండుసార్లు ఫేస్ వాష్ ని ఉపయోగించాలి. ఫేస్ వాష్ తో ముఖాన్ని రుద్దడం వలన జిడ్డు చర్మం వాళ్ళకి అదనపు జిడ్డు తొలగిపోతుంది మురికి కూడా పోతుంది. అప్పుడు ముఖం ఫ్రెష్ గా కనపడుతుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఆయిల్ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగించాలి. ఇలా ఉపయోగించడం వలన చర్మ రంధ్రాలు క్లీన్ అయిపోతాయి.
Advertisement
Advertisement
జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వారానికి ఒకటి రెండు సార్లు చర్మాన్ని ఎక్స్ప్యాలియెట్ చేయాలి దీంతో మృత చర్మ కణాలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అందంగా కూడా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు సాలిసిలిక్ యాసిడ్ లేదంటే ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్ ఉన్న టోనర్ ని వాడడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. జిడ్డు చర్మం పోగొట్టాలంటే ప్రతి రోజు మాయిశ్చరైజర్ వాడండి. తేలికైన ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ని వాడితే మంచిది. ఆయిల్ స్కిన్ తో బాధపడే వాళ్ళు పౌడర్ ని ఉపయోగించడం మంచిది చర్మంపై ఉన్న నూనెలని పీల్చుకుని చర్మాన్ని అందంగా మారుస్తుంది.
Also read:
- కంటి చూపు తగ్గుతోందా..? అయితే ఈ ఆహారపదార్ధాలని తప్పక తీసుకోండి…!
- చాణక్య నీతి: లైఫ్ లో ఎప్పుడు వీళ్ళని నిర్లక్ష్యం చేయకండి.. సమస్యలు వస్తాయి…!
- టాయిలెట్లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే… ఏం అవుతుంది అంటే..?