ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో రెండే రెండు జట్లు దూసుకుపోతున్నాయి. ఆ రెండు జట్లు టీమ్ ఇండియా మరియు న్యూజిలాండ్ మాత్రమే. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్టు అసలు ఓటమి చెందలేదు. ఆడిన మ్యాచ్ లన్ని గెలిచాయి. టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు గెలవగా… న్యూజిలాండ్ కూడా నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు గెలిచింది.
దీంతో టోర్నమెంట్ పాయింట్స్ టేబుల్ లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా… రెండవ స్థానంలో మన టీమిండియా ఉంది. అయితే ఈ రెండు జట్లు రేపు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రెండు జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇలాంటి తరుణంలో దసరా హాలిడేస్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
Advertisement
న్యూజిలాండ్తో మ్యా చ్ జరిగిన తర్వాత… అక్టోబర్ 29వ తేదీన ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా మ్యాచ్ ఆడనుంది. అంటే దాదాపు 8 రోజుల వరకు సెలవులు వస్తున్నాయి. అయితే ఈ గ్యాప్ నేపథ్యంలో… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, గిల్, రాహుల్ లాంటి కీలక ప్లేయర్లకు 8 రోజుల పాటు సెలవులు ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇక అక్టోబర్ 29వ తేదీన జరిగే ఇంగ్లాండ్ మ్యాచ్ కు వీరందరూ తిరిగి జట్టులో చేరనున్నారట.