ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో టీమిండియా కు ఎదురు లేకుండా పోయింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లు టీమిండియా విజయం సాధించింది. దీంతో వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్ లో టీమిండియా టాప్ పొజిషన్లో నిలిచింది. మొన్న న్యూజిలాండ్ జట్టుతో విజయం సాధించిన టీమిండియా ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళింది.
Advertisement
న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల లో మ్యాచ్ జరిగింది. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుతో లక్నోలో జరగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. అంటే మరో మ్యాచ్ ఆడడానికి దాదాపు 5 రోజుల సమయం ఉంది. దీంతో దసరా హాలిడేస్ ఎంజాయ్ చేయకుండా హిమాలయాలలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు టీమిండియా ప్లేయర్లు.
Advertisement
అయితే హిమాలయాలలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న టీమిండియా ప్లేయర్లను బీసీసీఐ పాలకమండలి హెచ్చరించింది. హిమాలయాల అందాలను ఎంజాయ్ చేయండి కానీ… ట్రెక్కింగ్ మాత్రం అస్సలు చేయకూడదని కోరింది బీసీసీఐ. అలా ట్రెక్కింగ్ చేస్తే ప్లేయర్లు గాయపడే ప్రమాదం ఉందని… అలా చేస్తే చర్యలు తీసుకుంటామని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిందట. దీంతో టీమ్ ఇండియా ప్లేయర్లు ట్రెక్కింగ్ అస్సలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట.