టీమిండియాలో ఇంజక్షన్ల కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో, టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం అతనికి ఒక ప్రముఖ వార్తా సంస్థ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ వర్గాలు చేతన్ శర్మ పై మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేయాలని చేతన్ నిర్ణయించుకున్నాడు. అతను పంపిన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జైశా ఆమోదించినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
తనపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ లో బీసీసీఐకి సంబంధించిన చాలా అంతర్గత వివరాలను చేతన్ శర్మ బహిర్గతం చేశాడు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం, బీసీసీఐలో గొడవలు తదితర అంశాలు అన్నింటిపై నోరు జారాడు. స్టార్ ఆటగాళ్లపై చేతన్ శర్మ చేసిన వాక్యాలు అందరికి షాక్ ఇచ్చాయి. ఫీట్ గా లేకపోయినా ఇంజక్షన్ చేసుకుంటారని, డొపింగ్ కు దొరక్కుండా ఏం చేయాలో వాళ్లకు తెలుసునని అన్నాడు. అలాగే తమకు కోహ్లీ నచ్చలేదని, అందుకే కెప్టెన్సీ నుంచి తొలగించామని బాంబు పేల్చాడు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత భారత క్రికెట్ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడిందనే చెప్పాలి. ఈ క్రమంలో చేతన్ శర్మపై బీసీసీఐ పెద్దలు చాలా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈతరణంలో ఇవాళ టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశాడు.
READ ALSO : పెళ్లికి రెడీ అవుతున్న అమృత ప్రణయ్…అసలు విషయం ఇదే!