కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలా కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన బండ్ల గణేష్… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందినటువంటి సుస్వాగతం సినిమాలో చేసిన పాత్ర ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
Advertisement
అలా ఎన్నో సినిమాల్లో నటించిన గణేష్ ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా తన కెరీర్ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా తీన్మార్, గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, బాద్ షా, టెంపర్ వంటి పలు సినిమాలను నిర్మించిన బండ్ల “టెంపర్” మూవీ తర్వాత సినిమా నిర్మాణానికి దూరం అయ్యాడు. ఆఖరుగా ఈయన మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను నవ్వించాడు.
Advertisement
ఇప్పటికే సినిమాల ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న ఈయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే గానూ లేదా ఎంపీగాను పోటీ చేయడానికి సిద్ధం అయిన బండ్ల అందులో భాగంగా కొన్ని పార్టీలపై విమర్శలను కూడా విసిరాడు. కానీ ఆ తర్వాత మనకు రాజకీయాలు సెట్ కావు అని… రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది అని చెప్పుకొచ్చాడు.
ఇలా రాజకీయాలు మనకు సెట్ కావు అని చెప్పుకొచ్చిన బండ్ల తాజాగా మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. బండ్ల గణేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా… “రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా” అంటూ పోస్ట్ చేశాడు. దీనితో మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుండి బండ్ల గణేష్ పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.