నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు తగ్గేదే అన్నట్లుగా ఈ సినిమా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 60 కోట్ల షేర్ కు చెరువు ఆయన అఖండ వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. అయితే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. నవంబర్ చివర్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ… ప్రీ రిలీజ్ వేడుక తోనే బోయపాటి శ్రీను.. ఈ ఆడిటోరియం మొత్తానికి కాకుండా… సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఊపు తీసుకువచ్చారని.. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి మొదలుపెట్టి థియేటర్లు కూడా… కంటిన్యూస్ గా హౌస్ఫుల్ అయి… అఖండ సినిమా బంపర్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు.
Advertisement
Advertisement
అయితే డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. రాజమౌళి కోరుకున్నట్టే అఖండ సినిమా సూపర్ హిట్ కూడా సూపర్ హిట్ అయింది. మిక్స్ డ్ టాక్ ఉన్నా కూడా వసూళ్ళలో మాత్రం దూసుకుపోతోంది. కరోనా సమయంలోనూ ఇంత భారీ విజయం సాధించడం అఖండ సినిమాకే దక్కుతుందని పలువురు సినీ ప్రముఖులు కూడా చెబుతున్నారు. ఇక పుష్ప, త్రిపుల్ ఆర్, భీమ్లా నాయక్ లాంటి పెద్ద సినిమాలను కూడా ధైర్యంగా రిలీజ్ చేసుకోవచ్చని.. నిర్మాతలకు కూడా భరోసా వస్తోంది. ఏదేమైనా ఎస్.ఎస్.రాజమౌళి ఎలా అయితే కోరుకుంటున్నారో ఆ కోరికను బాలయ్య అఖండ సినిమాతో తీర్చేస్తాడు.