నందమూరి హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బాలయ్య. తన నటనతో నటసింహంగా బాలయ్య గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా బాలయ్య పేరు సంపాదించుకున్నారు. రీసెంట్ గా అఖండతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇప్పుడు మరికొన్ని సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. అయితే బాలయ్య ఒక్కోసారి ఫైర్ అవుతుంటారు. కొన్ని సార్లు అభిమానులపై చేయి చేసుకున్న సంధర్బంగాలు కూడా ఉన్నాయి.
Advertisement
అంతే కాదు ఫోన్ లు విసరడాలు….కుక్కకు వార్నింగ్ లు ఇవ్వడాలు ఇలా బాలయ్య చేసే కొన్ని పనులతో ఆయనకు కోపం ఎక్కువ అనే పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన అభిమానులు ఆయనతో నటించిన వాళ్లు మాత్రం బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని చెబుతుంటారు. అయితే కోపదాటి మనిషిగా పేరు తెచ్చుకున్న బాలయ్య ఇప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెప్పడం ఆశ్చర్యకరం.
Also Read: IPL 2022 : ఐపీఎల్ కోసం బీసీసీ కొత్త ప్లాన్.. ‘ఒకే మైదానం ఐదు పిచ్‌లు’
Advertisement
రీసెంట్ గా బాలయ్య తాను కోపం తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ను పాటిస్తానని చెప్పాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు మొత్తం ఐదు టిప్స్ పాటిస్తానని తెలిపారు. అందులో మొదటిది మాట్లేడేముందు కాస్త ఆలోచించి మాట్లాడాలని చెప్పాడు. రెండోది కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే రెండోది కోపం వచ్చిన వెంటనే అంకెలు లెక్కపెట్టాలని చెప్పాడు. అంతే కాకుండా కోపం వచ్చినప్పుడు అరవకుండా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్పాడు.
Also Read: Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి శుభఫలితాలు కలుగుతాయి
మనసులో ఏమీ పెట్టుకోకుండా ఏది ఉంటే అది చెప్పాలని ఇతరుల పై కోపం ఉన్నా వారిని క్షమించాలని తెలిపారు. చివరగా బాలయ్య ఇచ్చిన టిప్ ముఖ్యమైనది….తన కోపమే తనకు శత్రువు కాబట్టి కోపాన్ని వీలైనంత తగ్గించుకునేందుకు సంతోషంగా ఉండాలని అన్నారు. ఇక మీరు కూడా కోపిష్టి అయ్యి ఉంటే బాలయ్య చెప్పిన ఈ టిప్స్ తో కోపాన్ని కంట్రోల్ చేసుకోండి.
Also Read: సినిమా కథకు ఏ మాత్రం తగ్గని రమా రాజమౌళిల ప్రేమకథ…ఎవరు ప్రపోజ్ చేశారంటే..!