Home » బాలయ్యకు జోడిగా రష్మిక మందన్న !

బాలయ్యకు జోడిగా రష్మిక మందన్న !

by Bunty
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 60పదుల వయసు వచ్చినప్పటికీ కుర్రహీరోలకు గట్టి పోటీని ఇస్తూ ఇండస్ట్రీలో ఇప్పటికీ స్టార్ హీరోగాచక్రం తిప్పుతు తన హవాను కొనసాగిస్తున్నారు. తన అద్భుతమైన నటన, పంచ్ డైలాగ్స్ తో అభిమానులను ఉర్రూతలు ఊగిస్తున్నారు. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే బాలకృష్ణ తన తదుపరి చిత్రం కోసం ప్లాన్ చేస్తున్నారట.

Balakrishna crush on Rashmika Mandanna

Balakrishna crush on Rashmika Mandanna

ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తాను హోస్ట్ గా చేసే ఆహాలో బాలకృష్ణ చేసే రచ్చ అంతాఇంతా కాదు. రోజురోజుకీ ఆహా షో బంపర్ హిట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు వచ్చే ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా బాలకృష్ణ యానిమల్ టీం తో ముచ్చటించారు. అందులో రష్మిక గురించి బాలయ్య ఇచ్చిన ఇంట్రడక్షన్ తో షో మరో లెవెల్ లో ఉంది. “నా మైండ్ బ్యాలెన్స్ లో లేదు. ఇక ఎందుకో ఈ తికమక వచ్చేయమ్మ రష్మిక” అంటూ బాలయ్య బాబు ఇన్వైట్ చేసిన తీరుకు ఫిదా అవుతున్నారు రష్మిక ఫ్యాన్స్.

Advertisement

Advertisement

Vijay Deverakonda And Rashmika Mandanna Are Dating Each Other

“నీతో మెలికలు తిరుగుతూ ఉంటే నా గుండె మెలికలు తిరుగుతుంది” అంటూ బాలయ్య ఇచ్చిన కాంప్లిమెంట్ కి రష్మిక తెగ సిగ్గు పడింది. ఈ ప్రోమో చూసిన చాలామంది బాలకృష్ణ, రష్మిక కాంబినేషన్లో ఓ సినిమా వస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ షోలో భాగంగా బాలకృష్ణ రష్మికని….రణబీర్ కపూర్, విజయ్ దేవరకొండ వీరిద్దరిలో బెస్ట్ హీరో ఎవరు అని అడుగుతున్న వీడియో ప్రోమో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఫోన్ కాల్ లో వాట్సాప్ రే అంటూ విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించడంతో రష్మిక షాక్ కి గురైన వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading