Home » క్రికెట్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్… ఇక నుండి వీటిని చూడలేరు…!

క్రికెట్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్… ఇక నుండి వీటిని చూడలేరు…!

by Sravya
Ad

చాలామందికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం క్రికెట్ ఆడడానికి చూడడానికి కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రాబ్ లిండా యూట్యూబ్ ఛానల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సచిన్ కి ముందు లెజెండ్రీ క్రికెటర్ల వీడియోలు చూడాలంటే మనకి ఉండే ఏకైక ఆప్షన్ ఇది అప్పటి ఆటగాళ్ల స్పెషల్ రికార్డులు అప్పటి మంచి మూమెంట్స్ ని అందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకువచ్చేవారు. అలానే క్రికెట్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్న రిఫరెన్స్ లు కావాలన్నా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ బాగా ఉపయోగపడేది. 14 ఏళ్ల నుండి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నారు.

Advertisement

Advertisement

కానీ ఇక మీదట ఇది దొరకదు ఎందుకంటే దీనిని శాశ్వతంగా క్లోజ్ చేసేసారు. రాబ్ లిండా యూట్యూబ్ ఛానల్ ని అఫీషియల్ గా తీసేస్తున్నారని.. దాని ఓనర్ ప్రకటించడం జరిగింది 14 ఏళ్లగా తనని ఆదరించిన వాళ్ళందరికీ కూడా థాంక్స్ చెప్పారు. కాపీ రైట్స్ ఇష్యూ కారణంగానే యూట్యూబ్ ఛానల్ ని క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్స్ రాబ్ లిండా చానల్ మీద స్ట్రైక్ చేశాయి. తమకి మాత్రమే హక్కు ఉన్నాయి అని వీడియోలని యూట్యూబ్ ఛానల్ దగ్గర ఉన్నాయని దీనివలన వాళ్ళకి నష్టం కలుగుతున్నాయని చెప్పారట.

తన దగ్గర ఉన్న వీడియోలని బయట పెట్టవు కనీసం యూట్యూబ్ ఛానల్స్ ని కూడా ఉండనివ్వట్లేదు. పాత క్రికెటర్ల ఆట ఇన్నింగ్స్ గురించి ఎక్కడపడితే అక్కడ మనకి కనపడవు. అవన్నీ పలు బ్రాడ్ కాస్టులు చేతుల్లో ఉంటాయి అటువంటిది మనకి ఈ ఛానల్ ఇన్నాళ్లు భద్రంగా దాచి అందరికీ అందుబాటులో ఉంచారు కానీ ఇప్పుడు అఫీషియల్ గా మూసేస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading