దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్అర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి లో నామినేషన్ కు ఎంపికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. కాగా 80 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేసిన రక్షిత్ మాస్టర్, నాటు నాటు సాంగుకు ఎన్టీఆర్, రామ్ చరణ్ చేత స్టెప్స్ వేయించాడు.
Advertisement
ఇక నాటు నాటు పాటకు ప్రపంచస్థాయిలో ఒక అవార్డు వచ్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి తగిన గుర్తింపు రాకపోవడంపై అందరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈరోజు ఈ స్థాయికి రావడానికి మాత్రం చాలా కష్టాలు అనుభవించాడు. అతడి వెనక ఒక దీనమైన గాధ ఉంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తండ్రి ఒక వజ్రాల వ్యాపారి. కొన్ని సమస్యల కారణంగా కుటుంబంతో విడిగా ఉండేవాడు. ఒంటరిగా ఉన్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి ఆర్టిక కష్టాలు పెరిగాయి. ఒకవైపు డ్యాన్స్ మాస్టర్ గా అవకాశాలు రావడం లేదు. మరోవైపు బ్రతకడానికి మార్గంలేని పరిస్థితి.
Advertisement
1993లో పూట గడవడం కోసం ఒక టైలర్ షాప్ కూడా పెట్టుకున్నాడు. ఇక తన చుట్టూ ఉన్న సమస్యలను తట్టుకోలేక ఆత్మ** చేసుకొని చనిపోవాలనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో తల్లి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ అతడిని బ్రతికించి ఇంత వాన్ని చేసింది. అది మరెవరి సినిమానో కాదు రాజమౌళి తీసిన చత్రపతి సినిమా. ఈ సినిమాలో ఒక్క పాట కాదు అన్ని పాటలకు డ్యాన్స్ మాస్టర్ గా అవకాశం వచ్చేలా తండ్రి చేయడంతో అక్కడ మొదలైన ప్రయాణం నేడు ప్రపంచస్థాయికి చేరింది.
READ ALSO : Pathaan Movie Review : “పఠాన్” మూవీ రివ్యూ