సాధారణంగా యుక్తవయసు వచ్చిన తరవాతే మహిళలు గర్బం దాల్చతారు. కానీ అప్పుడే పుట్టిన బాలిక గర్భంలో మరో పిండం పెరగటం ఎప్పుడైనా విన్నారా..? అంతే కాకుండా ఆ పిండం అభివృద్ధి చెంది అవయవ భాగాలు ఏర్పడ్డాయంటే నమ్ముతారా..? కానీ ఇది నిజంగా నమ్మవలసిన నిజం. వివరాల్లోకి వెళితే….ఉత్తరప్రదేశ్ లోని కుషీనగర్ జిల్లాలో వింతఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక రోషిణి పుట్టినప్పటి నుండి కడుపునొప్పితో బాధపడుతోంది. అయితే తల్లి దండ్రులు ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ బాలికకు సమస్య తగ్గలేదు.
దాంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు తీసుకెళ్లగా వైద్యులు ఆ బాలికకు ఫోమోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం బాలిక కడుపునొప్పికి కారణాలు చెప్పగా వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బాలిక కడుపులో గడ్డ లేదని కానీ తల కాళ్లు చేతులతో ఉన్న మృత శిశువు అని చెప్పారు. పుట్టికతోనే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడే ఆ బాలిక కడుపులో మరో పిండం పెరుగుతూ వచ్చిందని వైద్యులు చెప్పారు. ఇక బాలిక కడుపునొప్పి అని బాధపడినప్పుడల్లా పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లేవారు.
Advertisement
Advertisement
11 నెలల పాటు బాలుడి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన విజిల్!
ఫలితం లేకపోవడంతో పలువురు భూత వైద్యుల వద్దకు సైతం తీసుకెళ్లారు.అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ముంబై లోని సీయాన్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆ బాలిక పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. అనంతరం బాలిక కడుపులో మృత శిశువును గుర్తించి ఆపరేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.