ఒకప్పుడు బ్రహ్మానందం తర్వాత మళ్లీ అంతటి బిజీ ఉన్న కమెడియన్ బాబు మోహన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి బాబు మోహన్ అభిమానులను సంపాదించుకున్నాడు. కోట శ్రీనవాసరావు బాబు మోహన్ కాంబినేషన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. వీరిద్దరూ సీన్ లో కనిపించారు అంటే నవ్వులు పూసేవి. టాలీవుడ్ లోని స్టార్ట్స్ అందరి తో కూడా బాబు మోహన్ సినిమా లు చేశాడు. ఇక ఒక దశలో సినిమాల నుండి రాజకీయాల్లో కి ఎంట్రీ ఇచ్చాడు.
Advertisement
కాగా రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యాడు. ఇక ప్రస్తుతం రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతే కాకుండా టివి షోలలో కూడా కనిపిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో బాబు మోహన్ సంచలన విషయాలు బయటపెట్టాడు. తన పై ఒకసారి విషప్రయోగం జరిగింది అని చెప్పాడు. ఢిల్లీ లో వన్స్ మోర్ సినిమా షూటింగ్ సమయం లో తనికెళ్ళ భరణి తనకు మొదటి సారి పాన్ ఇచ్చారని అన్నారు. అది తిని తాను వెంటనే ఉమ్మేశా అని చెప్పాడు. కానీ ఆ మరుసటి రోజు తానే మళ్లీ పాన్ అడిగానని చెప్పాడు.
Advertisement
Also Read: టాలీవుడ్ లో 500 నుండి 1000 రోజులకు పైగా ఆడిన చిత్రాలు ఇవే…!
Also Read: రోడ్డు పై వాహనాలను ఆపుతున్న శ్రీరెడ్డి…ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!
అలా తనకు పాన్ లు అలవాటు అయ్యాయని తెలిపాడు. అప్పట్లో తాను రోజుకు ముప్పై పాన్ లు కూడా తిన్నా అని చెప్పాడు. సంగారెడ్డి లో తాను ఒక డబ్బా వద్ద పాన్ తినేవాడిని అని అది తెలిసి గిట్టని వాళ్ళు అందులో విషం కలిపారని చెప్పాడు. రాజకీయాల కోసమే ఆ పని చేశారని చెప్పాడు. పాన్ లో విషం కలపాలని తమపై ఒత్తిడి తీసుకువచ్చారు అని పాన్ డబ్బా యజమాని భార్య ఫోన్ చేసి చెప్పింది అని తెలిపారు. దాంతో ఆ పాన్ తాను పడేసినట్టు తెలిపారు.