ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీ మరియు ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు పది సంవత్సరాల తర్వాత మన దేశంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఇలాంటి ధర్నాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
పాకిస్తాన్లోని పంజాబ్ లో తన అడి కారులో అతివేగంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రయాణించాడు. ట్రాఫిక్ రూల్స్ లెక్కచేయకుండా… దుమ్ము లేపే స్పీడ్ తో కారు డ్రైవ్ చేశాడు. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ కు ఫైన్ వేశారు పాకిస్తాన్ ట్రాఫిక్ పోలీసులు. అతివేగం, రూల్స్ అతిక్రమణ కేసుల్లో భాగంగా బాబర్ అజమ్ కు ఫైన్ వేశారు పోలీసులు. అయితే ఇండియాలో వన్డే వరల్డ్ కప్ ఆడెందుకు కారు లో అతివేగంగా వచ్చావని కొంతమంది పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ పై సెటైర్లు పేల్చుతున్నారు.
Advertisement
Advertisement
వాస్తవానికి ఇండియా వచ్చేందుకు పాకిస్తాన్ ప్లేయర్లకు… మన బీసీసీఐ సరైన సమయంలో వీసాలు జారీ చేయలేదు. దీంతో ఈ విషయాన్ని ఐసిసి దృష్టికి తీసుకువెళ్లి పాకిస్తాన్ బోర్డు. ఈ తరుణంలోనే… ఇవాళ పాకిస్తాన్ ప్లేయర్లకు వీసాలు వచ్చాయి. దీంతో రేపు ఉదయం ఇండియాకు పాకిస్తాన్ ప్లేయర్లు రానున్నారు. అయితే వీసాలు లేకపోవడంతో… కారులో ఇండియాకు రావాలని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అనుకున్నారని… తాజాగా జరిగిన సంఘటన ను ఉద్దేశించి కొంతమంది సెటైర్లు వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్..హైదరాబాద్ లో ర్యాలీలు తీస్తే తాట తీస్తాం !
- టీడీపీకి షాక్.. ఏ14గా నారా లోకేష్..ఇక అరెస్ట్ తప్పదా ?
- జడేజాపై చేయి చేసుకున్న వార్నర్… BJP నేత సీరియస్ !