Home » SHABARIMALA AYYAPPA : ఇరుముడిక‌ట్టు అంటే ఏమిటి…దానిని ఎలా సిద్దం చేయాలి..?

SHABARIMALA AYYAPPA : ఇరుముడిక‌ట్టు అంటే ఏమిటి…దానిని ఎలా సిద్దం చేయాలి..?

by AJAY
Ad

దేవుడిపై న‌మ్మ‌కం ఉన్నావాళ్లు వారి సంక‌ల్పం నెర‌వేర‌డానికి లేదంటే దేవుడి పై ఉన్న భ‌క్తితో అయ్య‌ప్ప దీక్ష‌కు పూనుకుంటారు. ఎవ‌రైతే మొద‌టి సారి దీక్ష‌కు పూనుకుంటారో వారిని క‌న్నె స్వామి అని అంటారు. శ‌బ‌రిమ‌లైలోని అయ్య‌ప్పస్వామి పురాణాలు చెబుతున్న ప్రాకారంగా….ఎప్పుడైతే ఒక్క‌క‌న్నెస్వామి కూడా శ‌బ‌రిమ‌ల‌కు రాడో అప్పుడు నేను శ‌బ‌రిమ‌ల విడిచివెళ్లిపోతా అని అయ్య‌ప్ప చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. అందువ‌ల్లే క‌న్నెస్వాములు ఎక్కువ‌గా శ‌బ‌రిమ‌ల వెళ్లేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. అయితే క‌న్నెస్వాములు అయినా గురుస్వాములు అయినా శ‌బ‌రిమ‌ల వెళ్లే ముందు ఇరుముడి క‌ట్టు క‌ట్టుకుంటారు.ఇరుముడిని క‌ట్టేట‌ప్పుడు ఓ ప‌ద్ద‌తి కూడా ఉంది. ఆ ఇరుముడి అయ్య‌ప్ప పాదాల వ‌ద్ద‌కు చేరుకుంటే కోరిక‌లు నెర‌వేర‌తాయ‌ని తెలుస్తోంది.

AYYAPPA IRUMUDI KATTU

AYYAPPA IRUMUDI KATTU

ఇక ఇరుముడి ఎలా క‌ట్టాలి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం…సొంత ఇంట్లోనే ఇరుముడి క‌ట్టు క‌ట్టుకోవ‌డం మంచిది. త‌మ‌రోజువారి కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న త‌ర‌వాత ఇరుముడి క‌ట్టునేందుకు సిద్దం అవ్వాలి. ఇరుముడి అంటే రెండు ముడుపులు అని అర్థం. ఇరుముడి క‌ట్టుకునే సంధ‌ర్బంలో స్వామివారి స్మ‌ర‌ణ చేస్తూనే ఉండాలి. దేవుని చిత్ర ప‌టం ఎదుట ఇరుముడి క‌ట్ట‌డం ప్రారంభించాలి. శుభ్రంగా ఉన్న న‌ల్ల‌ని లేదా ఎరుపురంగు వ‌స్త్రాన్ని ప‌రిచి దాని అందులో ఇరుముడి కట్టాల్సి ఉంటుంది. ముందుగా ఓ టెంకాయ తీసుకుని దానిలోని నీటిని తీసిన త‌ర‌వాత దానిని శుభ్రంగా కాచిన నెయ్యితో నింపాలి. ఆ టెంకాయ‌లోని నెయ్యి భ‌య‌ట‌కు కార‌కుండా ల‌క్క‌తో అతికించాలి.

Advertisement

Advertisement

ALSO : SHABARIMALA AYYAPPA : ఇరుముడిక‌ట్టు అంటే ఏమిటి…దానిని ఎలా సిద్దం చేయాలి..?

ఆ త‌ర‌వాత ఆ రెండు టెంకాయ‌ల‌ను సంచిలో వేయాలి. ఆ సంచిలో బియ్యం మరియు ఎవ‌రైనా ఇచ్చిన కానుల‌ను నింపాలి. ఆ కానుక‌ల‌ను బియ్యంను ఎవ‌రు ప‌డితే వాళ్లు వేయ‌కూడదు. మందుగా దీక్ష‌కు పూనుకున్న స్వామి త‌ల్లిదండ్రులు, ఆ త‌ర‌వాత భార్య, సంతానం, తోబుట్టువులు ఇలా ఒక‌రిత‌ర‌వాత ఒక‌రు వేయాలి. అలా బంధువులు మ‌రెవ‌రైనా కూడా త‌మ కోరిక‌లు చెప్పుకుంటూ కానుల‌ను వేస్తే వారి కోరిక‌లు నెర‌వేర‌తాయ‌ని పురాణాల‌లో ఉంది. అలా సిద్ధం చేసిన సంచిని మ‌రో పెద్ద సంచిలో వేయాలి. ఆ సంచిలో చంద‌నం,అర‌గ‌బ‌త్తీ,తేనె, జాకెట్ బ‌ట్ట‌, 4కొబ్బ‌రికాయ‌లు,విభూతి, ప‌న్నీరు, పేలాలు, బెల్లం, యాల‌కులు నాలుగు వేయాలి. అలా వేసి దానికి కూడా ముడివేయాలి. అలా వేసిన దాన్నే ఇరుముడి క‌ట్టు అంటారు. అయితే ఇరుముడి క‌ట్టు మొత్తం గురుస్వామి ఆధ్వర్యంలోనే జ‌ర‌గాలి.

Visitors Are Also Reading