వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో ఇండియా కథ ముగిసింది. ఆస్ట్రేలియా ఆరవసారి సగర్వంగా వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో ప్రధాని మోదీ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రీచార్డ్ మార్లెస్ హాజరై విజేతలైన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కు వరల్డ్ కప్ ను అందించారు. అయితే ఇదే టైంలో జరిగిన ఓ సన్నివేశంపై ఆస్ట్రేలియా మీడియా, ఆస్ట్రేలియా క్రికెటర్స్, అభిమానులు మండిపడుతున్నారు. సాధారణంగా వరల్డ్ కప్ లాంటివి అందుకున్న వెంటనే మిగిలిన టీమ్ అంతా స్టేజ్ మీదకు వెంటనే పరుగు పరుగున వచ్చేస్తుంది. ఆ తర్వాత కప్పును చూస్తూ వారంతా ఛాంపియన్స్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ నిన్న అలా జరగలేదు.
Advertisement
ట్రోఫీని మోదీ అందించిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను కాసేపు పొగిడారు, మాట్లాడారు. ఆ తర్వాత మోదీ, రీచార్డ్ మార్లెస్ ఇద్దరూ స్టేజ్ దిగి కిందికి వెళ్లిపోయారు. కానీ ఆస్ట్రేలియా టీం ను మాత్రం స్టేజ్ మీదకు సెక్యూరిటీ పంపలేదు. మోదీ పూర్తిగా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన తర్వాత టీం ను స్టేజ్ మీదకు వదిలారు. అప్పటివరకు కమిన్స్ అలా ఒంటరిగా నిలబడిపోయి తన టీం కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ఇది క్రీడ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని, గెలిచిన జట్టు సంబరాలను ఓ రాజకీయ నాయకుడు కోసం అలా అడ్డుకోవడం సరికాదంటూ ఆస్ట్రేలియా మీడియా, ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.
Advertisement
ప్రపంచకప్ ను ఇంత అద్భుతంగా హోస్ట్ చేసిన భారత్ ట్రోఫీ వేడుకను మాత్రం వరస్ట్ గా ప్లాన్ చేసిందని మండిపడుతున్నారు. అయితే దీనికి ఓ కారణం కూడా కనబడుతోంది. 2006 చాంపియన్స్ ట్రోఫీ భారత్ లోనే జరిగింది. అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న శరత్ పవర్ ఆస్ట్రేలియాకి ట్రోఫీని అందించారు. కానీ అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ శరత్ పవర్ ను వెంటనే స్టేజి నుంచి దిగిపోవాలని నెట్టిన ఘటన ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేదు. అలాంటిదే మోదీకి ఎదురు కావచ్చని, ఆటగాళ్లు ఒక్కసారిగా దూసుకురావడం వంటివి చేస్తారు. కనుక సెక్యూరిటీ కారణాలతో మోదీ వెళ్లేవరకు టీం సెలబ్రేషన్స్ ను అడ్డుకున్నారని మరోవైపు వినిపిస్తోంది. మొత్తంగా ఈ ట్రోఫీ ప్రజెంటేషన్ వేడుకలో ఓ వివాదమైతే చెలరేగింది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.