తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పటికీ చాలామంది అభిమానులు ఉన్నారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ గురించి తరచూ గుర్తు చేస్తుంది లక్ష్మీపార్వతి. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. సీనియర్ ఎన్టీఆర్ చేసిన అన్యాయాన్ని వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుని, వాళ్ళు క్షమాపణ చెబుతారో అప్పుడే నా కోపం చల్లారుతుంది అని కామెంట్ చేశారు.
Advertisement
ఎన్టీఆర్ చితబస్మాన్ని నేను దాచుకున్నానని చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ఆ బస్మాన్ని తీసుకొని కావేరి నదిలో, హరిద్వార్ లో కొంత కలిపానని అన్నారు. నా గురించి కొంతమంది అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం బాలేని సమయంలో నేను ఆయనను దగ్గరుండి నడిపించుకున్నానని కామెంట్ చేశారు. మేమిద్దరం ఎన్నికల కోసం వెళ్ళామని అప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చిందని అన్నారు.
Advertisement
మా వంశోద్ధారకుడు విషయంలో నేను నా భర్త నిర్ణయాలు తీసుకున్నామని వాటి గురించి బయట చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. నందమూరి వంశం పూర్తిస్థాయిలో స్వీకరించలేదని లక్ష్మీ పార్వతి తెలియజేశారు. నేను స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఎత్తుకున్నానని ఆమె అన్నారు. తల్లిని పిల్లవాడిని ఇంటికి పిలిపించి తన తల్లికి పట్టుచీర తనకు డ్రెస్ కొని ఇచ్చానని తెలియజేశారు. ‘నాన్న నువ్వు రోజు రా నానమ్మ తాతయ్య ఉన్నారని’ ఎన్టీఆర్ కి చెప్పానని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రతిరోజు జూనియర్ ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చి కాసేపు ఆడుకొని వెళ్లేవాడని కామెంట్ చేశారు.
also read: