తమిళనాడు రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మొత్తం పద్నాలుగు మంది హెలికాప్టర్ లో ప్రయాణించగా ప్రమాదం జరిగిన వెంటనే పదమూడు మంది కన్నుమూశారు. ఆ బిపిన్ కు తీవ్రగాయాలు కాగా ఆయనకు వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ ఫలింతం లేకుండా పోయింది.
తీవ్ర గాయలతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో బిపిన్ కుటుంబ సభ్యులతో పాటూ మరికొంత మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్ వీడియో అంటూ నెట్టింట ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. వీడియోలో గాల్లో హెలికాప్టర్ కు మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు అంటుకున్న ఆ హెలికాప్టర్ గాల్లో చాలా సేపటివరకూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఆ మంటల్లో నుండి శకలాలు సైతం కింద పడే దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.
Advertisement
Advertisement
Also read :కాలుతున్న మనుషులు హెలికాప్టర్ నుండి పడ్డారు..షాకింగ్ నిజాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి…!
అయితే ఈ వీడియో ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ది కాదు. నిజానికి బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ కూనూర్ మధ్యలో ప్రమాదం చోటు చేసుకుంది. అంతే కాకుండా హెలికాప్టర్ ఒక్కసారిగా వచ్చి చెట్టును ఢీకొట్టింది అని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు బిపిన్ ప్రయాణించిన హెలికాప్టర్ ఆర్మీ హెలికాప్టర్ కాగా వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది సాధారణ హెలికాప్టర్ లా కనిపిస్తుంది.