Home » ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే సైలెంట్ హార్ట్ ఎటాక్..!!

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే సైలెంట్ హార్ట్ ఎటాక్..!!

by Sravanthi
Ad

ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్స్ అనేవి ఎక్కువయ్యాయి. అప్పట్లో బాగా కొలెస్ట్రాల్ ఉన్నవారికి హార్ట్ ఎటాక్ వచ్చేదని మనం వినేవాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో ఈ సమస్య ఎవరికి వస్తుందో అర్థం కావడం లేదు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇక సినిమా హీరోల విషయానికొస్తే చాలామంది హార్ట్ ఎటాక్ బారినపడి మరణించడం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. తాజాగా తారకరత్న కూడా హార్ట్ ఎటాక్ బారిన పడి ఆస్పత్రిలో క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. సాధారణంగా హార్ట్ ఎటాక్ వచ్చిన వారు బతికే అవకాశాలు ఎక్కువ. కానీ కార్డియాక్ అరెస్టు అయితే వెంటనే చనిపోతారు. హార్ట్ ఎటాక్ కి సైలెంట్ హార్ట్ ఎటాక్ చిన్న తేడాలున్నాయి.. వాటిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే సైలెంట్ హార్ట్ ఎటాక్ నుంచి తప్పించుకోవచ్చు.

Advertisement

 

సాధారణంగా సినిమాలో మనం చూసినప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చిన మనిషి గిలగిలా కొట్టుకుంటాడు. అతని ఆస్పత్రికి తీసుకెళ్లడం మనకు చూపిస్తూ ఉంటారు. అయితే గుండెకు రక్త సరాపరలో తేడా వస్తే హార్ట్ ఎటాక్ అవుతుంది. అలా అయినప్పుడు 6 గంటల పాటు బతికే అవకాశాలుంటాయి. ఇలా కాకుండా డైరెక్ట్ గా గుండెలోనే తేడా వస్తే వెంటనే మరణిస్తారు. దీని కార్డియాక్ అరెస్టు అని అంటారు. ఇది వస్తున్న విషయం తెలియదు. వచ్చిన ఒకటి రెండు సెకండ్ల లోపే చనిపోతారు. అయితే ఈ రెండు కాకుండా సైలెంట్ హార్ట్ ఎటాక్ కూడా ఉంది. ప్రస్తుతం వస్తున్న హార్ట్ ఎటాక్లలో 40 శాతం మందికి సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇది స్త్రీల కంటే పురుషులకు ఎక్కువగా వస్తుందట. దీని వైద్య భాషలో సైలెంట్ మయో కార్డియాల్ ఇన్స్పక్షన్ అంటారు.

Advertisement

ఇది వచ్చినప్పుడు చాతి దగ్గర నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది. తర్వాత వెళ్ళిపోతుంది. దీన్ని మనం మామూలే కదా అనుకుంటాం. నిర్లక్ష్యం చేస్తాం . ఆ తర్వాత ఏదో ఒక రోజు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతారు . చాలా కేసుల్లో ఇలాంటిదే జరుగుతోంది. సరైన సమయంలో గుర్తించకపోవడం వల్ల ప్రాణాల మీదకు వస్తుందని డాక్టర్లు అంటున్నారు.
సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు:
– ఈ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చెస్ట్ దగ్గర కొద్దిగా నొప్పి వస్తుంది.
– చెయ్యి మెడ దవడ దగ్గర కూడా నొప్పి వస్తుంది.
– కళ్ళు మసకబారుతాయి.
ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మీరు సైలెంట్ హార్ట్ ఎటాక్ గా గమనించాలి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మాత్రం రియల్ గా హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొదట్లోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని వైద్యులంటున్నారు.

also read:

Visitors Are Also Reading