Home » APRIL 9th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 9th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

కడపలో నేటి నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు జ‌రుగుతున్నాయి. 10 రోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జ‌ర‌గనుండ‌గా ఈ నెల 15న రాత్రి 8 గంటలకు సీతారాముల కళ్యాణం నిర్వ‌హించ‌నున్నారు.


జాతినుద్దేశించి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిపక్ష నేతలపై ఫైర్ అయ్యారు. నేను ఎందులోనూ రాజీపడను, పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. పాక్‌ సుప్రీంకోర్టు తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

టీ టైమ్ ఓనర్‌ ఉదయ్ జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్‌ కల్యాణ్ సమక్షంలో ఉద‌య్ పార్టీలో చేరారు.

ఆస్కార్ వేధిక‌పై హాస్య‌న‌టుడు క్రిస్ రాక్ చెంప చెల్లుమ‌నిపించిన హీరో విల్ స్మిత్ పై నిషేదం విధించారు. ప‌దేళ్ల పాటు అకాడ‌మీ మ‌రియు ఇత‌ర వేడుక‌ల్లో పాల్గొన‌కుండా నిషేదం విధించారు.

Advertisement

తిరుప‌తి సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో భారీ దోపిడీ జ‌రిగింది. అనంత‌పురం తుర‌క‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్ స‌మీపంలో దుండ‌గులు సిగ్న‌ల్ తీగలు క‌త్తిరించి రైలును ఆపారు. ఆ త‌ర‌వాత మార‌ణాయుధాల‌తో రైలులోకి చొర‌బ‌డి ప్ర‌యాణీకుల వ‌ద్ద న‌గలు, డ‌బ్బులు దోచుకున్నారు.

ముంబై పేలుళ్ల సూత్ర‌దారి హ‌ఫీజ్ స‌యూద్ కు 31 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్ట్ తీర్పును ఇచ్చింది.

ర‌ష్యా సైన్యం ఆడ‌వాళ్ల‌పై ఆకృత్యాల‌ను కొన‌స‌సాగిస్తూనే ఉంది. కాగా ర‌ష్యా సైన్యం నుండి త‌ప్పించుకునేందుకు ఉక్రెయిన్ మ‌హిళ‌లు జుట్టును క‌త్తిరించుకుంటున్నారు.

సింగ‌రేణి ఉద్యోగాల్లో స్థానికుల‌కే 95శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తూ నిర్న‌యం తీసుకున్నారు. కాగా గ‌తంలో 80శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లులో ఉండేది.

దేశంలోని 15 రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో మురుగు నీటిలో కోవిడ్ మ‌హ‌మ్మారి జాడ‌ను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. దాంతో కోవిడ్ ప్ర‌భావం ఇంకా త‌గ్గుముకం ప‌ట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

corona vaccine

భార‌త బ‌యోటెక్ త‌యారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను జ‌పాన్ ఆమోదించింది. కోవాగ్జిన్ ను గుర్తింపు పొందిన వ్యాక్సిన్ ల జాబితాలో చేర్చింది.

Visitors Are Also Reading