Home » APRIL 29th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 29th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,377 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 60 మరణాలు నమోదయ్యాయి. 2,496 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం 17,801 యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

నేడు సాయంత్రం 6 గంటలకు ఎల్బీ స్టేడియంలో స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఈ విందులో పాల్గొన‌బోతున్నారు.

బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సలీమ్‌ గౌస్ (70) ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు. స‌లీమ్ గౌస్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల‌లో హీరోగా న‌టించాడు.


టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు ప్ర‌కాశం జిల్లా నేత‌లతో భేటీ అవుతున్నారు. మహానాడు సన్నాహకాలపై వారితో చ‌ర్చించ‌నున్నారు. మధ్యాహ్నం కాకినాడ అర్బన్, విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అంతే కాకుండా సాయంత్రం గుంటూరులో ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజ‌ర‌వుతారు.

క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ పై అమెరికా ప‌రిశోధ‌కులు ఆస‌క్తిక‌ర విషయాల‌ను వెల్ల‌డించారు. ఎలుక‌ల నుండి ఒమిక్రాన్ వేరియంట్ మాన‌వుల్లో ప్రవేశించి ఉండ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. జంతువుల్లో ఒమిక్రాన్ వేల సంఖ్య‌లో ఉత్ప‌రివ‌ర్త‌నాల‌కు గుర‌వుతూ వేగంగా మార్పు చెందుతుంద‌న్నారు.

Advertisement

కాంగ్రెస్ లోకి చేరికపై ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ కు త‌న అవ‌స‌రం లేద‌ని..త‌నంత‌ట తాను పూర్వ‌వైభ‌వాన్ని సాధించ‌గ‌ల శ‌క్తిసామ‌ర్థ్యాలు కాంగ్రెస్ కు ఉన్నాయ‌ని అన్నారు. అందుకే కాంగ్రెస్ నుండి ఆహ్వానం అందినా రిజెక్ట్ చేశాన‌ని చెప్పారు.

ఆఫ్గ‌నిస్థాన్ లో ఐఎస్ఐ తీవ్ర‌వాదులు రెచ్చిపోయారు. ఉత్త‌రఆఫ్గ‌నిస్థాన్ లో మినిబ‌స్సుల్లో బాంబులు అమ‌ర్చి పేళుల్ల‌కు పాల్ప‌డ్డారు. ఈ పేలుళ్ల‌ల్లో 9మంది మృతి చెంద‌గా 13 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

పోటీ అన‌చివేసే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌తో గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జ‌ కంపెనీల‌కు స‌మ‌న్లు జారీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు గుర‌వారం పార్లమెంట్ నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌ధాని మోడీ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల‌లో అమ‌లులో ఉన్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌క‌టించారు. గ‌డిచిన 8ఏళ్ల‌లో ఈశాన్య రాష్ట్రాల‌లో ప‌రిస్థితులు మెరుగుప‌డ్డాయని మోడీ భావించారు.


మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ఆచార్య సినిమా నేడు దేశ‌వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కు కొర‌టాల శివ దర్శ‌క‌త్వం వ‌హించారు.

Visitors Are Also Reading