భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు స్వర్ణ భారత్ ట్రస్ట్ కు చేరుకుంటారు. రేపు అల్లూరులో దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ ను వెంకయ్య నాయుడు సందర్శిస్తారు. ఆ తరవాత ఆకాశవాణి ఎఫ్.ఎం. కేంద్రం టవర్ ను ప్రారంభిస్తారు.
Advertisement
తెలంగాణ సర్కార్ ఆచార్య సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆచార్య సినిమా టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ నెల 29 నుంచి మే 5 వరకు ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
యాదాద్రి పేరుపై వివాదం నెలకొంది. ఆలయ పునఃనిర్మాణంతో యాదాద్రిగా
ప్రభుత్వం పేరు మార్చిన సంగతి తెలిసిందే. కాగా యాదగిరిగుట్ట అంటూ సీఎంవో ప్రెస్‌నోట్ ను విడుదల చేసింది. దాంతో వివాదం నెలకొంది. వెంటనే సీఎంఓ సవరించుకుని మళ్లీ యాదాద్రి అని ప్రకటన విడుదల చేసింది.
సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రైవేటీకరణ పేరిట ఇన్నాళ్లూ జరిగింది అబద్దపు ప్రచారం అని కొట్టి పారేశారు. కేంద్రమంత్రిగా చెబుతున్నా సింగరేణిని ప్రైవేటీకరించం అంటూ హామీ ఇచ్చారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో నేడు పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రేవంత్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఖమ్మంలో పోలీసుల వేధింపులకు గురైన కాంగ్రెస్ నేతలను రేవంత్ రెడ్డి కలవనున్నారు.
Advertisement
ఈయూ యురోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. యూరోపియన్ యూనియన్ ఇండియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు.వాణిజ్యం, భద్రత, టెక్నాలజీ లాంటి అంశాల్లో సవాళ్లను ఎదుకునేందుకు ఈ కౌన్సిల్ ఏర్పాటు చేశారు వారు నిర్ణయించారు.
చైనాలోని షాంఘై నగరంలో కరోనా ఉదృతి కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో షాంఘైలో 51 మంది కరోనాతో మరణించారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు. 2 వారాల క్రితం ట్విట్టర్ లో 9.2 శాతం వాటా కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ తాజాగా ఆ సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేశాడు. 54.20 డాలర్ల చొప్పున మొత్తం షేర్లను మస్క్ కొనుక్కున్నాడు. అంతేకాకుండా వాక్ స్వాతంత్రానికి మరింత అనువుగా ట్వీట్టర్ ను తీర్చిదిద్దుతామని ప్రకటించాడు.
2019లో అత్యంత ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసిన జపాన్ చెందిన కానే టకానా 119 సంవత్సరాల వయసులో ఈనెల 19న తుదిశ్వాస విడిచారు.
సైనిక వ్యయంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అమెరికా, చైనా ఒకటి రెండు స్థానాల్లో ఉండగా భారత్ మూడో స్థానంలో నిలిచింది.