Home » APRIL 25th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 25th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నేడు సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం పంచకుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన‌భోతున్నారు.

Advertisement

ఐపీఎల్ లో వరుసగా 8వ మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ ఓట‌మిపాలైంది. లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

టీచర్లకు సెలవులు ఇవ్వకూడదనే నిర్ణయం వాపస్ తీసుకోవాలని బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలం ఇస్తారా..? అంటూ ప్ర‌శ్నించారు. కావాల‌నే టీచ‌ర్ల‌కు సెల‌వులు ఉవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

శ్రీలంక‌లో నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. 16వ రోజుకు ఈ నిర‌స‌న‌లు చేరాయి. ప్ర‌ధాని ఇంటి గోడ‌ల‌పైకి ఎక్కి నిర‌స‌న‌కారులు ఆందోళ‌న చేప‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ రాజీనామా చేసే ప్ర‌స‌క్తే లేద‌ని మ‌హింద రాజ‌ప‌క్స తేల్చిచెప్పారు.

అల్లూరిసీతారామ‌రాజు జిల్లాలో మావోయిస్టులు ఆర్టీసీ బ‌స్సుకు నిప్పు పెట్టారు. చింతూరు మండ‌లం కొత్తూరు వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒడిశా నుండి బ‌స్సు హైద‌రాబాద్ వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Advertisement

ప‌లువురు కాంగ్రెస్, వైసీపీ నేత‌ల‌తో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌మావేశం అవ్వ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో ప‌ర్య‌టించిన ల‌గ‌డ‌పాటి ప‌లువురు నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. దాంతో ఆయ‌న పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నారా అంటూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

ఏపీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ తో సీఎం జ‌గ‌న్ భేటీ కానున్నారు. మొద‌టిసారి జ‌స్టిస్ ప్ర‌శాంత్ తో సీఎం భేటీ అవుతున్నారు. దాంతో వీరిభేటీపై ఆస‌క్తినెల‌కొంది.

ఫ్రాన్స్ అధ్య‌క్షుడిగా మ‌రోసారి ఇమూన్యుయేల్ మాక్రాన్ ఎన్నిక‌య్యారు. ఇమాన్యుయేల్ కు 58శాతం ఓట్లు రాగా ప్ర‌త్య‌ర్థి మ‌రీన్ లీపెన్ కు 42శాతం ఓట్లు వ‌చ్చాయి. 39 ఏళ్ల వ‌య‌సులోనే అధ్య‌క్షుడిగా గెలిచి ఫ్రాన్స్ లో అతిచిన్న వ‌య‌స్సు గ‌ల అధ్య‌క్షుడిగా గ‌తంలో ఇమాన్యుయేల్ రికార్డు క్రియేట్ చేశారు.

విశాఖ‌ప‌ట్నం పోర్టుకు టెక్సాస్ నుండి 2.72ల‌క్ష‌ల క్రూడాయిల్ ను తీసుకువ‌చ్చారు. ఈ రేంజ్ లో క్రూడాయిల్ ను తీసుకురావ‌డం ఇదే మొద‌టిసారి కావడంతో స‌రికొత్త రికార్డును సృష్టించారు.

Ap cm jagan

Ap cm jagan

వ‌ర‌ల్డ్ ఎకనామిక్ ఫోరం వార్శిక‌ స‌ద‌స్సు మే 22 నుండి 26 వ‌రకూ స్విట్జ‌ర్లాండ్ దావోస్ లో జ‌ర‌గ‌నుంది. ఈ స‌ద‌స్సుకు ఏపీ జ‌గ‌న్ కూడా హాజ‌రుకానున్నారు. వివిధ దేశాల పారిశ్రామిక‌వేత్త‌లు, ఆర్థిక‌వేత్త‌లు ఈ స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు.

Visitors Are Also Reading