Home » APRIL 15th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 15th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నేడు న్యాయాధికారుల సమావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్య అతిథిగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజ‌ర‌వుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లోని జిల్లా న్యాయమూర్తులతో ఈ సమావేశం జ‌రుగుతోంది.


సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాన‌ని హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా నేటి నుండి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళును ప్రారంభించ‌నున్నారు.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

ఈ రోజు కడపలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జ‌ర‌గ‌నుంది. ఈ క‌ళ్యాణంలో సీఎం జ‌గ‌న్ సీతారాముల‌కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఐపీఎల్ లో నేడు హైదరాబాద్‌ కోల్‌కతా త‌ల‌ప‌డనున్నాయి. ముంబైలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

కాంగ్రెస్ నేత కోమ‌టిరెట్టి వెంక‌టరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేయడానికి కొట్లాడుతాన‌ని అన్నారు. ఏ పార్టీలోకి వెళ్ళను…పేదవాళ్ళ వెంబడి ఉంటా. అడగకుండానే స్టార్ క్యాంపెనర్ ఇచ్చారు సోనియాగాంధీ. దళితుడిని CM చేయడానికి నేను రెడీ అంటూ కోమ‌టిరెట్టి పేర్కొన్నారు.

ఏపీలో జైభీం భార‌త్ పార్టీ పేరుతో మ‌రో కొత్త పార్టీని ప్రారంభించారు. పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు శ్ర‌వ‌ణ్ ఇది ద‌ళితుల కోసం కొట్లాడే పార్టీ అని అన్నారు.

అలియా భ‌ట్, ర‌న్బీర్ క‌పూర్ ల వివాహ వేడుక ముంబైలో ఘ‌నంగా జ‌రిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన రోజా అంబేద్క‌ర్ దినోత్స‌వం నాడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అంబేద్క‌ర్ బ‌తికుంటే సీఎం జ‌గన్ ను అభినందించేవార‌ని వ్యాఖ్యానించారు.

గాలిలో ఎగురుతున్న విమానంలో మంట‌లు చెల‌రేగ‌టం క‌ల‌క‌లం రేపింది. అసాం నుండి ఢిల్లీ వెళుతుండ‌గా ఓ ప్ర‌యాణికుడి ఫోన్ లో నుండి మంట‌లు చెల‌రేగ‌టంతో ఒక్క‌సారిగా టెన్ష‌న్ నెల‌కొంది. దాంతో సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై మంట‌లు ఆర్పేశారు.

Visitors Are Also Reading